కరోనా సోకిందని తెలిసినా.. బస్సులో వెళ్లిన ముగ్గురు

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో తమకు ఎక్కడ వైరస్‌ సోకుతుందన్న భయంతో చాలా మంది బయటకు కూడా వెళ్లలేకపోతున్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 7:39 am, Sun, 5 July 20

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో తమకు ఎక్కడ వైరస్‌ సోకుతుందన్న భయంతో చాలా మంది బయటకు కూడా వెళ్లలేకపోతున్నారు. అలాంటింది వైరస్‌ సోకిందని తెలిసి కూడా ముగ్గురు ఆర్టీసీ బస్సెక్కారు. శనివారం మధ్యాహ్నం గం.3.30ని.లకు సికింద్రాబాద్‌ జేబీఎస్‌ నుంచి సూపర్‌ లగ్జరీ బస్సు(TS08Z 0229)లో ఈ ముగ్గురు ఆదిలాబాద్‌కి వెళ్లారు. శనివారం రాత్రి గం.10.30ని.లకు ఈ బస్సు ఆదిలాబాద్‌ చేరుకోగా.. నేరుగా ఆ ముగ్గురు అక్కడి రిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. తమకు కరోనా సోకిందని ఆసుపత్రిలో చేర్చుకోవాలని అక్కడి వైద్యులను కోరారు. దీంతో వారిని చేర్చుకున్న వైద్యులు.. వివరాలపై ఆరా తీయగా బస్సులో వచ్చినట్లు తేలింది. వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది బస్సులో ప్రయాణించిన వారు కరోనా పరీక్షలను రావాలని కోరుతున్నారు. కాగా ఇటీవలే ఈ ముగ్గురు నిర్మల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ ముగ్గురికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది.