అవినీతి అంతు చూడ సాధ్యమా?

నీతి. అవినీతి. పదాలు రెండే. కానీ అర్థంలో చాలా తేడా ఉంది. నీతి నైతిక విలువలను చెబుతోంది. అవినీతి అనైతికతను ప్రొత్సహిస్తోంది. అందుకు కలిసొచ్చే ఏ ఒక్క అంశాన్ని వదలదు. రెండిటికీ నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరం ఉంది. సంపాదించు. అనుభవించు. ఆనందించు. ఇది నేటి నీతి. సంపాదించటమే గొప్పతనం. ఎలా సంపాదించామన్నది ముఖ్యంకాదు. బతికినంతకాలం ఆనందించాలి. అనుభవించాలి. పర్యవసానం సంగతి తర్వాత. ఏం జరుగుతుందన్నది పట్టించుకోవడం లేదు. ఒక రంగం కాదు..అన్ని రంగాల్లో ఇప్పుడు అవినీతి […]

అవినీతి అంతు చూడ సాధ్యమా?
Follow us

|

Updated on: Jan 14, 2020 | 6:50 PM

నీతి. అవినీతి. పదాలు రెండే. కానీ అర్థంలో చాలా తేడా ఉంది. నీతి నైతిక విలువలను చెబుతోంది. అవినీతి అనైతికతను ప్రొత్సహిస్తోంది. అందుకు కలిసొచ్చే ఏ ఒక్క అంశాన్ని వదలదు. రెండిటికీ నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరం ఉంది. సంపాదించు. అనుభవించు. ఆనందించు. ఇది నేటి నీతి. సంపాదించటమే గొప్పతనం. ఎలా సంపాదించామన్నది ముఖ్యంకాదు. బతికినంతకాలం ఆనందించాలి. అనుభవించాలి. పర్యవసానం సంగతి తర్వాత. ఏం జరుగుతుందన్నది పట్టించుకోవడం లేదు. ఒక రంగం కాదు..అన్ని రంగాల్లో ఇప్పుడు అవినీతి రాజ్యమేలుతోంది. కాలం కరుగుతోంది. పాలకులు మారుతున్నారు. పార్టీలు మారుతున్నాయి. అవినీతి అంతు చూస్తామని చెప్పడం తప్ప చేయలేని పరిస్థితి.

భారత్‌ను అవినీతి రహిత రాజ్యంగా మారుస్తానన్నది ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన మాట. ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు చాలాసార్లు ఆయన చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగులుతున్నాయి. అవినీతి రక్కసి అంతు చూసేందుకు పావులు కదిపినా..ఇందుకు పరిస్థితులు అనుకూలించడంలేదు. అదే సమయంలో అవినీతే మోడీ అంతు చూస్తోంది. ఆసియాలో అత్యంత అవినీతి దేశంగా భారత్‌ నిలిచింది. 69 శాతం అవినీతితో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. మన తర్వాత స్థానం వియత్నాం దేశానిది. అక్కడ 65 శాతం లంచాలు తీసుకునే వారుంటే… థాయిలాండ్‌లో 41 శాతం, పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో 40 శాతం అవినీతి నమోదైంది. 0.2 శాతంతో జపాన్‌ ఈ జాబితాలో చివరి స్థానంలో నిలవడం ఆసక్తికరమే. భారత్‌లో ప్రతీ పది మందిలో ఏడుగురు ఏదో ఒక సందర్భంలో లంచాలు ఇచ్చిన వారే. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న పౌర సమాజ సంస్థ ట్రాన్స్‌పరెన్నీ ఇంటర్నేషనల్‌ నిర్వహించిన తాజా సర్వేలో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆ సంస్థ తన నివేదికను బయట పెట్టింది. ఇప్పుడు దేశ మంతటా ఇదే నివేదిక పై చర్చ సాగుతోంది.

జర్మనీకి చెందిన ఈ సంస్థ ఏడాదిన్నర పాటు 16 ఆసియా దేశాల్లో సర్వే నిర్వహించింది. ఈ సర్వే నివేదికను ఫోర్బ్స్‌ పత్రిక వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న భారత్‌లో విద్య, ఆరోగ్యం, పోలీస్, వినియోగ సేవలు, ఐడి డాక్యు మెంట్లు.. ఇలా ప్రతీ విభాగంలోనూ అవినీతి రాజ్యమేలుతుందని ఆ నివేదిక తెలిపింది. భారత్‌లో లంచాల బెడద ఎక్కువగా వుంది. ఎప్పుడో ఒకసారి తాము లంచాలు ఇచ్చినట్లు చాలా మంది ఒప్పుకున్నారట. మిగతా దేశాల కంటే భారత్‌లో పబ్లిక్‌ స్కూల్స్‌ (58 శాతం), ఆసుపత్రులు (59 శాతం) విభాగాల్లో లంచాల బెడద మరింత ఎక్కువగా వున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. ప్రాథమిక సౌకర్యాలు కల్పనకు లంచాలు చెల్లించాల్సి వస్తుందని తెలిపింది. ఇందు గలదు అందు లేదని సందేహం వలదు. అంతా అవినీతి మయం. అది ఇదీ అని లేకుండా దేశంలో ప్రతీ విభాగంలోనూ అవినీతి తిష్ట వేసిందని పేర్కొంది. అవినీతి నిర్మూలనకు ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆ సంస్థ నివేదిక తేట తెల్లం చేస్తోంది. ఈ జర్మనీ సంస్థ సమర్పించిన నివేదికలో వచ్చిన అంశాలు ప్రపంచదేశాల్లో చర్చనీయాంశమయ్యాయి. భారత్‌లో ఇంత అవినీతి ఉందా అని చర్చించుకోవడం కనిపిస్తోంది. అవినీతి నిర్మూలనకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితాలు ఇవ్వడం లేదు.

ఇక మన దగ్గరకు వస్తే…

ఒకే ఒక్కడు సినిమాలో హీరో అర్జున్ ముఖ్యమంత్రిగా పదవి నిర్వహిస్తాడు. ఒక్క రోజు ముఖ్యమంత్రిగా పని చేసి అవినీతి అధికారుల అంతు చూస్తాడు. అక్రమాల కలుపుమొక్కలను ఏరేస్తాడు. ఇందులో భాగంగా తప్పు చేసిన వారిని అక్కడకు అక్కడే ఉద్యోగం నుంచి తప్పిస్తాడు. అది సినిమాలో జరిగింది. కానీ దాన్ని నిజం చేసి చూపిస్తానంటున్నాడు ఏపీ సి.ఎం జగన్ మోహన్ రెడ్డి. చట్టంతో తనకు సంబంధం లేదు. ప్రభుత్వ పథకాల అమలులో తప్పు చేస్తే ఎవరినీ క్షమించే ప్రసక్తే లేదంటున్నారాయన. అంతే కాదు..14500 నెంబర్‌కు ఫోన్ చేసి ఎవరైనా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు. లంచాలు తీసుకున్న వ్యక్తి ఎవరైనా వెంటనే తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే సంబంధిత అధికారి పై అక్కడకు అక్కడే చర్య తీసుకుంటారట. అవినీతిని రూపు మాపేందుకు జగన్ సర్కారు తీసుకున్న డేరింగ్ స్టెప్పు ఇది.

ప్రజల ముందే అతన్ని శిక్షించేందుకు జగన్ సిద్దమవుతుండటం సంచనాలకు కేంద్ర బిందువైంది. లంచాలు తీసుకున్న వ్యక్తులు తిరిగి |ఇచ్చేయాలని లేకపోతే కచ్చితంగా చర్య తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. దీంతో అవినీతి అధికారులు, ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక మీదట వారిని చూస్తు ఊరుకోబోమని ఎవరినీ వదిలేదని లేదని జగన్ బాహాటంగానే ప్రకటించారు.

అధికార యంత్రాంగంలోని అవినీతి మాత్రమే కాదని, ఇతరత్రా అవినీతిని కూడా అదుపు చేయాల్సిన అవసరముందన్నారు ముఖ్యమంత్రి జగన్. అవినీతిని ప్రక్షాళన చేసుకుంటూ వెళుతున్నామని జగన్ చెప్పారు. పోలవరం నిర్మాణం, సాగునీటిప్రాజెక్టులు, ఇసుక మాఫియా, వివిధ పనులకు టెండర్ల కేటాయింపులు వంటి విషయాల్లో అవినీతి జరుగుతుందని విపక్షాలు చేస్తున్న విమర్శలు. మేము పారదర్శకంగానే చేస్తున్నాం. ఇందులో అవినీతికి తావు లేకుండా చూసే బాధ్యతమాదని చెప్పారు సీఎం.

ఇక జాతీయ స్థాయిలో చూస్తే…

జాతీయ మీడియాలో అవినీతికి సంబంధించిన వార్తలు కుప్పులు తెప్పలుగా వస్తున్నాయి. అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వద్రా వందల కోట్లు అక్రమార్జన చేశారని ఎన్నో సార్లు కథనాలు వచ్చాయి. ఇలాంటివి రాకూడదనే ఆలోచనతోనే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ చాలా జాగ్రత్త పడ్డారు. అవినీతి మకిిలి తమ ఇంటికి అంటకుండా జాగ్రత్త పడేవారట. ఈ విషయంలో తన మామ నెహ్రూను ఇబ్బంది పెట్టేందుకు వెనుకాడలేదు. ప్రధాని నెహ్రూ అల్లుడుగా ఆయన అధికార నివాసంలో ఉండొచ్చు. కాని ఫిరోజ్ అందుకు ఇష్టపడలేదు. అంతేకాదు. లోక్ సభ సభ్యుడిగా అవినీతిపై రాజీలేని పోరాటం చేసే అందరి మన్ననలు పొందడం తెలిసిన సంగతే. ఆ కాలంలో దమానియా కుంభకోణం, ముంద్రా కుంభకోణాలు వెలుగులోకి వచ్చి ప్రభుత్వాన్ని ఒక కుదుపు కుదిపాయి. అప్పటి ఆర్ధిక మంత్రి టి.టి.కృష్ణమాచారి ఈ కుంభకోణంలో ఇరుక్కుని పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ఆ కుటుంబం నుంచి వచ్చిన వద్రా విషయంలో ఆరోపణలు బాగానే వచ్చాయి. వ్యాపారానికి రాజకీయాలను ఉపయోగించుకున్నారనే వాదన వచ్చింది. హర్యానా, రాజస్థాన్ లలో కాంగ్రెస్ పాలకులు వందల కోట్ల ఆస్తులు వెనకేసుకున్నారనే ఆరోపణలు లేకపోలేదు. అవినీతి పోరాట యోధుడు హస్తిన సి.ఎం అరవింద్ కేజ్రీవాల్ వద్రా కేసును బయట పెట్టగానే కాంగ్రెస్ ఉలిక్కి పడింది. అదే సమయంలో హర్యానా ప్రభుత్వం వద్రా కేసు విచారణకు అదేశించిన అధికారి అశోక్ ఖెమ్కాను బదిలీ చేసింది. ఫలితంగా అపఖ్యాతిని మూటగట్టుకుంది.

బిజెపి నేత నితీష్ గడ్కరీ నిర్వహించిన కాంట్రాక్టు సంస్థలు, వ్యాపార సంస్థలపై ఆరోపణలు వచ్చాయి. మహారాష్ట్రలో ఆయన చేసిన వ్యాపారాలకు ప్రభుత్వంలో ఉన్నవారిని కూడా వాడుకున్నారనే విమర్శ ఉంది. ఆయన కంపెనీలలో డ్రైవర్లు డైరెక్టర్లుగాను, అటెండర్లు సీనియర్ అధికారులుగాను రికార్డులు పుట్టాయి. బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీపై హవాలా ఆరోపణలు వచ్చాయి. అలా రావడమే ఆలస్యం చేయలేదు. తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అవినీతి లేదని తేలాకనే ఆయన పదవి తీసుకున్నారు. అదీ ఆదర్శమైన పని అంటే. కానీ గడ్కరీ ఆ పని చేయలేదు. ఇక రాబర్ట్ వద్రా కేసులో ఆ పని చేయలేదు కాంగ్రెస్. ఎదురు దాడికి దిగింది. బిజేపి నేత గడ్కరీ కంపెనీలపై దర్యాప్తు చేయాలని ప్రదానికి లేఖ రాసిన దిగ్విజయ్ సింగ్ వద్రా జోలికి వెళ్లలేదు. అదే సమయంలో మధ్యప్రదేశ్ హైకోర్టు దిగ్విజయ్ సింగ్ కు సంబంధించిన లావాదేవీలపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. 2జీ స్పెక్ట్రం’ కేటాయింపు ద్వారా ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన రూ. 1,76,000 కోట్లకు గండి కొట్టిన భారీ కుంభకోణం అతిపెద్దది.

దేశ ప్రతిష్టకు మచ్చ…

నల్లధనం స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో 18 నుంచి 21 శాతం వరకు ఉంది. ప్రతిరోజు సరాసరిన 240 కోట్ల రూపాయలు దేశ సరిహద్దులు దాటిపోతున్నాయి. 1948-2008 సంవత్సరాల మధ్య దేశం నుంచి 46,200 కోట్ల డాలర్ల సొమ్ము విదేశాలకు తరలిపోయింది. మరో 17,800 కోట్ల డాలర్ల సొమ్ము దేశంలోనే నల్లధనంగా చలామణిలో ఉంది. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనానికి అడ్డుకట్టవేద్దామని ప్రధాని మోడీ భావించినా..ఆ కల నెరవేరడంలేదు. గడచిన దశాబ్ద కాలంలోనే 5.75 లక్షల కోట్ల రూపాయలను కోల్పోయినట్లు తెలుస్తోంది.

కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో అవినీతి, ఐపీఎల్ క్రికెట్ కుంభకోణం, ‘ఆదర్శ్ సొసైటీ’ అపార్ట్‌మెంట్స్‌ను రాజకీయ నాయకులకు, సైన్యాధికారులకు, ఉన్నతాధికారులకు కేటాయించారు. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి ప్రతిష్టాత్మకమైన ఆర్థిక సంస్థలలో రుణాల మంజూరులో భారీ లంచాలకు పాల్పడిన సంగతి తెలియంది కాదు. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కుమార స్వామి పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ భూములను బంధువులకు దారాదత్తం చేయడం వంటి అవినీతి కుంభకోణాలు దేశాన్ని కుదిపేశాయి. కుంభకోణాలకు బాధ్యులని ఆరోపణలు ఎదుర్కున్న కేంద్ర మంత్రులు ఎ.రాజా, శశిథరూర్, సురేష్ కల్మాడీ ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కానీ అక్రమ సంపాదన వారి సొంతమైంది. 1986 సంవత్సరంలో బోఫోర్స్ ఆయుధాల కొనుగోలులో కుంభకోణం దేశాన్ని ఒక కుదుపు కుదిపింది. ఫ్రాన్స్ నుండి 1990 సంవత్సరంలో ఎయిర్‌బస్ ఎ-320 కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన రూ.2,500 కోట్లు కిక్‌బ్యాక్ కుంభకోణం, 1993 సంవత్సరంలో రూ.3,000 కోట్ల హర్షద్ మెహతా సెక్యూరిటీ స్కాం, గోల్డ్ స్టార్ స్టీల్ అండ్ అల్లాయ్స్ వివాదం ఈ కోవలోనివే. 1992 సంవత్సరంలో ప్రధాన మంత్రి పదవిని కాపాడుకునేందుకు కోటి రూపాయల లంచంతో పి.వి.నరసింహా రావు సూట్‌కేస్ ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. జేఎంఎం అవినీతి కేసు, హవాలా స్కామ్, యూరియా స్కామ్ వగైరా కుంభకోణాల్లో అవినీతి, అక్రమాలు, అధికార దుర్విని యోగానికి పాల్పడ్డ వారికి ఎవరికీ శిక్షలు పడలేదన్న వాస్తవం.

అవినీతి మయం…

అధికార యంత్రాంగంలో అవినీతి బాగమైంది. అవినీతి నిరోధక సంస్థ (ఎసీబీ) అంచనా మేరకు 10శాతం మంది ప్రభుత్వోద్యోగులు మాత్రమే అవినీతికి దూరంగా నిజాయితీతో ఉన్నారట. 10 నుంచి 15శాతం మంది పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయి సంస్కరించడానికి కూడా అనర్హులుగా ఉన్నారని నివేదిక ఇచ్చింది. 70శాతం మందిని సంస్కరించడానికి అర్హులుగా గుర్తించడం విశేషం. ఏ అవినీతి ఉన్నతాధికారిని లేదా ఉద్యోగిని పట్టుకున్నా కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులు బయట పడుతున్నాయి. అయినా, అవినీతి అధికారులకు ఏమాత్రం భయం లేకుండా పోయింది. కారణం ఏసీబీ నమోదు చేసిన కేసుల నుంచి వారు తేలికగా తప్పించుకుంటున్నారు. సిబీఐ, ఏసీబీ, రాష్ట్ర, కేంద్ర విజిలెన్స్ కమిషన్స్, లోకాయుక్త లాంటి సంస్థలు అవినీతిని బహిర్గతం చేసి అరికట్టాల్సింది ఉంది. కానీ అవి కాగితపు పులులుగా మారుతున్నాయనే విమర్శలు లేకపోలేదు. బహుళ జాతి సంస్థలు, స్వదేశీ, విదేశీ కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, వాణిజ్య వేత్తలు, పెద్దపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు, రాష్ట్ర కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ప్రజల ఆస్తులను, ధనాన్ని దోపిడీ చేస్తుంటే నివారించే శక్తి పాలకులు, ప్రభుత్వాలకు లేకపోయింది. అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా అవినీతి అంతానికి న్యాయవ్యవస్థ ఇతర సంస్థలు కృషి చేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దురదృష్ట మేమంటే ఆ అత్యున్నత న్యాయస్థానం వైపు కూడా వేలెత్తి చూపించే దుస్థితి దాపురించింది.

మనల్ని పట్టి పీడిస్తున్న అవినీతి సమస్యను పూర్తిగా అరికట్టాలి. అది సాధ్యం కాకపోయినా కనీసం నిరోధించాలి. ముందుగా మంచి వ్యవస్థలను తయారు చేయాలి. రాజకీయ వ్యవస్థ, దర్యాప్తు వ్యవస్థలు కలగలిసిపోకుండా చూడాలి. అధికారంలో ఉన్నవారి కోసం పనిచేసే సంస్థలుగా అవి మారకుండా ఉండాలి. అవి పాలకులు చెప్పినంత కాలం అవినీతిని నిర్మూలించడం అసాధ్యమే అన్నది నిజం. రాజకీయపార్టీలు తమ వంతుగా సంస్కరణలు తీసుకు రావాలి.

-కొండవీటి శివనాగరాజు సీనియర్ జర్నలిస్టు, టీవీ9

జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు