బ్రేకింగ్: సీఎం కేసీఆర్ కాన్వాయ్‌కి అడ్డుతగిలిన యువకుడు

| Edited By:

Jun 02, 2020 | 11:26 AM

తెలంగాణ సీఎం కేసీఆర్ కాన్వాయ్‌కి అడ్డుతగిలాడు ఓ యువకుడు. హైదరాబాద్‌ గన్‌పార్క్ దగ్గర ఈ ఘటన జరిగింది. తనకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కావాలంటూ విజ్ఞాపన పత్రం పట్టుకుని సీఎం కాన్వాయ్‌కి అడ్డుగా వెళ్లాడు. దీంతో వెంటనే ఆ యువకుడిని పోలీసులు..

బ్రేకింగ్: సీఎం కేసీఆర్ కాన్వాయ్‌కి అడ్డుతగిలిన యువకుడు
Follow us on

తెలంగాణ సీఎం కేసీఆర్ కాన్వాయ్‌కి అడ్డుతగిలాడు ఓ యువకుడు. హైదరాబాద్‌ గన్‌పార్క్ దగ్గర ఈ ఘటన జరిగింది. తనకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కావాలంటూ విజ్ఞాపన పత్రం పట్టుకుని సీఎం కాన్వాయ్‌కి అడ్డుగా వెళ్లాడు. దీంతో వెంటనే ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవరకొండకు చెందిన హనుమంత్‌నాయక్‌గా పోలీసులు గుర్తించారు.

కాగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి  ప్రగతి భవన్‌లో‌ కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అలాగే కరోనా వ్యాప్తిలో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో అందరూ మాస్కులు, శానిటైజర్లు విధిగా ఉపయోగించడం, భౌతిక దూరం తప్పకుండా పాటించాలని సూచించింది తెలంగాణ సర్కార్.

ఇవి కూడా చదవండి:

మళ్లీ ఎబోలా కలకలం.. నలుగురు మృతి

ప్రపంచంపై కరోనా పంజా.. పెరుగుతున్న మరణాలు

కరోనా కలవరం.. నటి ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం