Stealth Omicron: సోమవారం నుంచి మళ్లీ లాక్‌డౌన్‌! మహమ్మారి చావులు ఓవైపు.. ఆకలి కేకలు మరోవైపు!

|

Mar 27, 2022 | 9:34 PM

మహమ్మారి నాలుగోసారి చాపకింద నీరులా కోరలు చాస్తోంది. లాక్‌డౌన్‌తో ఇప్పటికే ఆర్థివ వ్యవస్థ అస్థవ్యస్థమైపోయింది. మరోసారి ఆ గడ్డుకాలం పరిణమించబోయేలా ఉంది పరిస్థితి..

Stealth Omicron: సోమవారం నుంచి మళ్లీ లాక్‌డౌన్‌! మహమ్మారి చావులు ఓవైపు.. ఆకలి కేకలు మరోవైపు!
Lockdown
Follow us on

omicron-driven Covid outbreak 2022: కరోనా వైరస్ పుట్టిల్లు చైనాలో మరోసారి మృత్యు గటికలు మోగుతున్నాయి. గత కొన్ని రోజులుగా కోవిడ్‌ కొత్త వేరియంట్‌ స్టెల్త్‌ ఒమిక్రాన్‌ కోరలు చాచుతోంది. చైనాలో ఇప్పటివరకు ఫైనాన్స్‌ హబ్‌గా పేరుగాంచిన జిలిన్‌లో కొత్త వేరియంట్ తాలూకు పాజిటివ్‌ కేసులు 2,078 నమోదుకాగా, ఆ సంఖ్యను ఆర్థిక నగరమైన షాంగై ఓవర్‌టేక్‌ చేసినట్లు చైనా ఆదివారం (మార్చి 27) మీడియాకు తెల్పింది. కాగా ఈ రోజు షాంగైలో 2,676 అత్యధికంగా కొత్త వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో చైనాలో దాదాపు 26 మిలియన్ల ప్రజలు నివసించే అతిపెద్ద నగరమైన షాంగై (Shanghai)లో సోమవారం నుంచి వరుసగా 5 రోజులపాటు దశల వారీగా లాక్‌డౌన్‌ (lockdown) విధించనున్నట్లు ఈ మేరకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆదేశాల మేరకు అధికారులు ప్రకటించారు. వైద్య సేవలు మినహా మొత్తం నగరమంతా (ప్రజా రవాణాతో సహా) కఠిన లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు చేయనున్నట్లు తెల్పింది. అత్యవసర సమయంలో మాత్రమే ప్రైవేట్‌ వాహనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా తెల్పింది. ఐతే గ్లోబల్‌ షిప్పింగ్‌ హబ్‌గా ప్రసిద్ధిగాంచిన షాంగైలో లాక్‌డౌన్‌ విధిస్తే.. ఆ ప్రభావం తప్పనిసరిగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థపై పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. షాంగై నగరంలో గడచిన మూడు రోజుల్లో వరుసగా గురువారం 1,609, శుక్రవారం 2,267, శనివారం 2,676 అత్యధిక కేసులు నమోదయ్యాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు..

మరోవైపు ఒమిక్రాన్‌ సబ్ వేరియంట్‌ BA.2 అత్యంత వేగంగా వ్యాప్తి చెందే అంటువ్యాధని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఈ వేరియంట్ ప్రస్తుతం చైనాతో సహా హాంకాంగ్‌, యూరప్, యునైటెడ్ స్టేట్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో వెలుగు చూసినట్లు వెల్లడించింది.

మనదేశంలో కోవిడ్‌ కేసులు ఇలా..
గడచిన 24 గంటల్లో దేశంలో 1421 కోవిడ్‌ ఇన్ఫెక్షన్లు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రోజు (మార్చి 27)న తెల్పింది. వీటిల్లో అత్యధికంగా కర్ణాటకలో ఆదివారం ఒక్క రోజులోనే 64 కొత్త కోవిడ్-19 కేసులు నమోదుకాగా, ఒకరు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటెన్‌లో తెల్పింది. దీంతో మొత్తం కోవిడ్‌ పాజిటిక్‌ కేసుల సంఖ్య 1,777కి చేరుకుంది. కాగా గడచిన 24 గంటల్లో 62 మంది కోలుకోవడంతో మొత్తం 39,03,442 మంది కోవిడ్‌ నుంచి సురక్షితంగా బయటపడినట్లు తెల్పింది. కోవిడ్ కేసుల సంఖ్య 39,45,311కి చేరుకుంది. ఈ రోజు ఒకరు మృతి చెందడంతో కోవిడ్‌ మరణాలు 40,050కు చేరుకున్నట్లు తెల్పింది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్ పాజిటివిటీ రేటు 0.24 శాతంగా ఉన్నట్లు ఈ సందర్భంగా తెల్పింది.

Also Read:

Assam Rifle Sports Recruitment 2022: స్పోర్ట్స్‌కోటా జాబ్స్‌! అసోం రైఫిల్స్‌ స్పోర్ట్స్ పర్సన్స్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నోటిఫికేషన్‌..