ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సిరివెన్న‌ల సీతారామ శాస్త్రి త‌న‌యుడు

| Edited By:

Aug 16, 2020 | 4:47 PM

టాలీవుడ్‌లో ఇటీవ‌ల పెళ్లిళ్ల సంద‌డి నెల‌కొన్ని సంగ‌తి తెలిసిందే. కొన్ని నెల‌లుగా ప‌లువురు న‌టీన‌టులు ఓ ఇంటివార‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ గీత ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుమారుడు, నటుడు రాజా ఈ రోజు ఘ‌నంగా ఎంగేజ్‌మెంట్..

ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సిరివెన్న‌ల సీతారామ శాస్త్రి త‌న‌యుడు
Follow us on

టాలీవుడ్‌లో ఇటీవ‌ల పెళ్లిళ్ల సంద‌డి నెల‌కొన్ని సంగ‌తి తెలిసిందే. కొన్ని నెల‌లుగా ప‌లువురు న‌టీన‌టులు ఓ ఇంటివార‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ గీత ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుమారుడు, నటుడు రాజా ఈ రోజు ఘ‌నంగా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు. జీవితంలోని కొత్త ప్ర‌యాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న‌ట్లు రాసుకొచ్చారు.

కాగా న‌టుడు రాజా ప‌లు సినిమాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఆహా యాప్‌లో రిలీజ్ అయిన‌ భానుమ‌తి రామ‌కృష్ణ మూవీలో న‌టించారు రాజా. అంత‌కు ముందు అజ్ఞాత వాసి, నాపేరు సూర్య‌.. నా ఇల్లు ఇండియా, హ్యాపీ వెడ్డింగ్‌, అంత‌రిక్షం, మిస్ట‌ర్ మ‌జ్ను, ర‌ణ రంగం వంటి సినిమాల్లో ముఖ్య పాత్ర‌లు పోషించారు. ఇక త్వ‌ర‌లోనే ఒక‌టి కాబోతున్న ఈ జంట‌కి పులువురు సినీ ప్ర‌ముకులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

Read More: 

ఈ రోజు నుంచి రేప‌ల్లెలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌

వెద‌ర్ వార్నింగ్ః తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్

ఏపీః మండ‌పేట ఎమ్మెల్యేకి క‌రోనా పాజిటివ్‌