వాళ్లకే తొలి దశ కరోనా వ్యాక్సిన్: కేంద్రం

కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఎవరికి ముందు ఇవ్వాలన్న దానిపై కేంద్రం కసరత్తు ప్రారంభించింది. తొలిదశ వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలి.?

వాళ్లకే తొలి దశ కరోనా వ్యాక్సిన్: కేంద్రం
Follow us

|

Updated on: Oct 17, 2020 | 7:42 PM

Covid Vaccine Supply: కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఎవరికి ముందు ఇవ్వాలన్న దానిపై కేంద్రం కసరత్తు ప్రారంభించింది. తొలిదశ వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలి.? ఎవరెవరిని మొదట ప్రాధాన్యతగా తీసుకోవాలి.? అనే విషయాలపై కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. ఆ కథనం ప్రకారం..

తొలిదశ కరోనా వ్యాక్సిన్‌ను ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొదటి దశలో భాగంగా వీరికి 60 కోట్ల డోసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు దేశంలోని 23 శాతం మంది జనాభాకు కరోనా టీకాను అందించేందుకు చర్యలు తీసుకుంటోందట. ఈ క్రమంలోనే దేశ ప్రజలను నాలుగు కేటగిరీలుగా విభజించినట్లు సమాచారం. మొదటి కేటగిరిలో 50-70 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు.. రెండో కేటగిరిలో దాదాపు రెండు కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు, మూడో కేటగిరి 50 ఏళ్లు పైబడిన వృద్దులు, నాలుగో కేటగిరి 50 ఏళ్లు తక్కువ వయసు ఉన్నవారిని చేర్చినట్లు తెలుస్తోంది.

కాగా, దేశంలో ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయిల్స్ చివరి దశకు చేరుకున్న సంగతి విదితమే. దీనికి సంబంధించిన నివేదికలు నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదట్లో వస్తాయని కేంద్రం తెలిపింది. ఈ క్రమంలోనే కోవిడ్ వ్యాక్సిన్ తొలిదశ పంపిణీపై కేంద్రం కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..