“పాపి”స్థాన్‌ కుట్రల గురించి తెలిస్తే షాక్ తినాల్సిందే.. ఎలా స్కెచ్ వేసిందో చూడండి..!

పాపిస్థాన్‌ కుట్రల గురించి తెలిస్తే షాక్ తినాల్సిందే.. ఎలా స్కెచ్ వేసిందో చూడండి..!

పాకిస్థాన్.. కానీ దీనిని పాపిస్థాన్‌ అంటేనే ఈ దేశానికి సూట్ అవుతుందేమో. ఎందుకంటే ఇది చేసే కుట్రలు, కుతంత్రాలు పగవాడు కూడా చేయడేమో. ఈ దేశం చేసే కుట్రలన్నీ అన్నీ ఇన్నీ కావు. ఒక మాట మీద ఉండటం కానీ.. ఒక ఒప్పందాన్ని గౌరవించాలన్న విషయం కానీ తెలీదు. ఇదంతా ఎందుకంటే.. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కరోనాతో పోరాడుతుంటే.. పాకిస్థాన్ మాత్రం.. తన వక్రబుద్దిని ప్రదర్శిస్తోంది. ఓ వైపు సొంత దేశంలో కరోనా వైరస్ వ్యాప్తితో ప్రజలు […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 12, 2020 | 9:17 AM

పాకిస్థాన్.. కానీ దీనిని పాపిస్థాన్‌ అంటేనే ఈ దేశానికి సూట్ అవుతుందేమో. ఎందుకంటే ఇది చేసే కుట్రలు, కుతంత్రాలు పగవాడు కూడా చేయడేమో. ఈ దేశం చేసే కుట్రలన్నీ అన్నీ ఇన్నీ కావు. ఒక మాట మీద ఉండటం కానీ.. ఒక ఒప్పందాన్ని గౌరవించాలన్న విషయం కానీ తెలీదు. ఇదంతా ఎందుకంటే.. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కరోనాతో పోరాడుతుంటే.. పాకిస్థాన్ మాత్రం.. తన వక్రబుద్దిని ప్రదర్శిస్తోంది. ఓ వైపు సొంత దేశంలో కరోనా వైరస్ వ్యాప్తితో ప్రజలు భయాందోళనలకు గురవుతుంటే.. అవేమీ పట్టించుకోకుండా.. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ.. భారత్‌లో అలజడి సృష్టించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు.. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. దేశంలోకి ఉగ్రవాదులను ఎగదోస్తోంది. అది కూడా అలాంటి ఇలాంటి ఉగ్రవాదులను కాదు.. కరోనా పాజిటివ్ వచ్చిన ఉగ్రవాదులను పంపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందుకు.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)ని కరోనా క్వారంటైన్‌ కేంద్రంగా మార్చేసింది. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని పీవోకేకు తరలిస్తోంది. అంటే పాక్ బుద్ది ఎంటో అర్ధం చేసుకోవచ్చు.

పీవోకేలో ఉన్న వారితో బయో టెర్రరిజానికి పాక్ కుట్రలు పన్నినట్లు పక్కా సమాచారం ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అక్కడి నుంచి కరోనా పాజిటివ్ ఉన్నవారిని నేపాల్ ద్వారా భారత్‌లోకి పంపిచేందుకు ప్రయత్నిస్తోందన్నారు. నేపాల్ సరిహద్దుల్లో ఉన్న ఓ మసీదులో దాదాపు 200 మందిని రెడీగా ఉంచిందని పక్కా సమాచారం అందిందన్నారు. అంతేకాదు.. ఇప్పటికే కొంతమంది వస్తే వారిని పట్టుకున్నామని.. కరోనా అంతమయ్యాక అన్ని వివరాలు దేశ ప్రజలముందు పెడ్తామన్నారు.ప్రస్తుతం సరిహద్దుల్లో మన భద్రతా బలగాలను అప్రమత్తం చేశామని.. ఫెన్సింగ్‌ లేని ప్రాంతాలు, నదులున్న చోట సిబ్బందిని మరింత పెంచి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు.

కాగా.. అటు బంగ్లా సరిహద్దుల్లో కూడా చికిత్స పేరుతో కొందరు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. వచ్చే వ్యక్తి కరోనాను మోసుకొస్తుంటే ఊరుకునేది లేదన్నారు. బంగ్లా మిత్రదేశమేనని.. వారికి కూడా ఔషధాలు అందిస్తామని.. పాక్ అడిగినా కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని.. అలా అని కరోనా సోకిన వారిని దేశానికి పంపిస్తుంటే ఉరుకునే ప్రసక్తే లేదన్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu