వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో క్రికెట్ షురూ…

|

May 18, 2020 | 10:40 PM

కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడా టోర్నమెంట్లన్నీ వాయిదా పడ్డాయి. ఆఖరికి ప్రపంచంలోనే అత్యధిక ధనిక లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను కూడా బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. అయితే ప్రస్తుతం దేశాలన్నీ కూడా లాక్ డౌన్ క్రమంగా ఎత్తివేస్తుండటంతో క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల మొదటివారంలో క్రికెట్ ఆటను మళ్ళీ మొదలుపెట్టాలని నిర్ణయించింది. జూన్ 6న టీ20 డార్విన్ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నీతో దేశవాళీ సీజన్ మొదలుపెట్టనున్నట్లు […]

వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో క్రికెట్ షురూ...
Follow us on

కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడా టోర్నమెంట్లన్నీ వాయిదా పడ్డాయి. ఆఖరికి ప్రపంచంలోనే అత్యధిక ధనిక లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను కూడా బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. అయితే ప్రస్తుతం దేశాలన్నీ కూడా లాక్ డౌన్ క్రమంగా ఎత్తివేస్తుండటంతో క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది.

వచ్చే నెల మొదటివారంలో క్రికెట్ ఆటను మళ్ళీ మొదలుపెట్టాలని నిర్ణయించింది. జూన్ 6న టీ20 డార్విన్ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నీతో దేశవాళీ సీజన్ మొదలుపెట్టనున్నట్లు సీఏ స్పష్టం చేసింది. కాగా, కరోనా నేపధ్యంలో క్రికెటర్లు బంతిపై ఉమ్ము వేయరాదని, చెమట ఉపయోగించకూడదని ఆదేశించింది. అంతేకాకుండా గ్రౌండ్‌లో క్రికెటర్లు సామాజిక దూరాన్ని పాటిస్తారని ఆస్ట్రేలియా బోర్డు వెల్లడించింది.