కిమ్ ఇలాకాలో.. నో కరోనా.. నిజమేనా.!

|

Apr 02, 2020 | 11:16 PM

Coronavirus Outbreak: చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి దాటికి ప్రపంచదేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో చైనాకు సరిహద్దు దేశమైన నార్త్ కొరియా తాజాగా చేసిన ప్రకటన అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటివరకు తమ దేశంలో కరోనా పాజిటివ్ కేసు ఒక్కటీ నమోదు కాలేదని ఆ దేశ అధికారులు చెబుతున్నారు. కరోనాను నియంత్రించేందుకు సామాజిక దూరం, లాక్ డౌన్లు పాటించాలంటూ ప్రపంచసంస్థలు గట్టిగా చెబుతుంటే.. నార్త్ కొరియా మాత్రం చైనాలో […]

కిమ్ ఇలాకాలో.. నో కరోనా.. నిజమేనా.!
Follow us on

Coronavirus Outbreak: చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి దాటికి ప్రపంచదేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో చైనాకు సరిహద్దు దేశమైన నార్త్ కొరియా తాజాగా చేసిన ప్రకటన అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటివరకు తమ దేశంలో కరోనా పాజిటివ్ కేసు ఒక్కటీ నమోదు కాలేదని ఆ దేశ అధికారులు చెబుతున్నారు.

కరోనాను నియంత్రించేందుకు సామాజిక దూరం, లాక్ డౌన్లు పాటించాలంటూ ప్రపంచసంస్థలు గట్టిగా చెబుతుంటే.. నార్త్ కొరియా మాత్రం చైనాలో ఈ మహమ్మారి ప్రభావం పెరుగుతున్న సమయంలోనే తమ దేశ సరిహద్దులను జనవరిలోనే మూసివేశామని పేర్కొంటున్నారు.

కరోనా వ్యాప్తి దేశంలో రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందని ఆ దేశ యాంటీ ఎపిడిమిక్ డిపార్టుమెంట్ డైరెక్టర్ పాక్ మ్యోంగ్సూ తెలిపారు. ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా ఇప్పటివరకు దేశంలో నమోదు కాలేదని వెల్లడించారు.

‘దేశంలోకి ప్రవేశించే సిబ్బందిని తనిఖీ చేయడమే కాకుండా ముందస్తు చర్యలతో పాటు స్వీయ నిర్భందాలు, శాస్త్రీయ చర్యలను కూడా చేపట్టామన్నారు. అలాగే అన్ని వస్తువులను పూర్తిగా క్రిమిసంహారకం చేశాం. అటు జనవరిలోనే సరిహద్దులతో పాటు సముద్ర, వాయు మార్గాలను కూడా మూసివేయడంతో ఈ మహమ్మారిని జయించామని మ్యోంగ్సూ వెల్లడించారు. అయితే వైద్య రంగంలో బలహీనంగా ఉన్న నార్త్ కొరియాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం ఏంటని పలువురు నిపుణులకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

For More News:

మందుబాబులకు మరో షాక్.. మద్యం అమ్మకాలు ఇక లేనట్లే..

కరోనాను దాచిపెట్టిన చైనా.. బయటపడ్డ సంచలన రహస్యాలు..

కరోనా లాక్ డౌన్.. రూల్స్ అతిక్రమిస్తే కాల్చెయ్యండి..

ఏప్రిల్ 15 నుంచి టికెట్ల రిజర్వేషన్లు.. రైల్వే శాఖ క్లారిటీ..

ఆరు వారాల చిన్నారిని మింగేసిన క‌రోనా…

లాక్ డౌన్ వేళ.. కార్లు, బైకులు వాడితే సీజ్.. పోలీసుల హెచ్చరిక..

ఆపరేషన్ నిజాముద్దీన్.. మర్కజ్ చీఫ్‌తో సహా ఏడుగురికి నోటిసులు..