Delta plus variant: తిరుపతిలో తొలి డెల్టా ప్లస్‌ కేసు.. బాధితుడి ప్రైమ‌రి కాంటాక్ట్స్ అయిన 16 మంది నుంచి శాంపిల్స్ సేక‌ర‌ణ

|

Jun 27, 2021 | 1:05 PM

ఏపీలోని తిరుపతిలో తొలి డెల్టా ప్లస్‌ కేసు వెలుగు చూడటంతో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సోకిన వ్యక్తికి ప్రాథమిక కాంటాక్టులుగా...

Delta plus variant: తిరుపతిలో తొలి డెల్టా ప్లస్‌ కేసు.. బాధితుడి ప్రైమ‌రి కాంటాక్ట్స్ అయిన 16 మంది నుంచి శాంపిల్స్ సేక‌ర‌ణ
Delta Plus Variant
Follow us on

ఏపీలోని తిరుపతిలో తొలి డెల్టా ప్లస్‌ కేసు వెలుగు చూడటంతో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సోకిన వ్యక్తికి ప్రాథమిక కాంటాక్టులుగా గుర్తించిన 16 మంది నుంచి శాంపిల్స్ సేకరించారు. వాటిని హైదరాబాద్‌లోని సీసీఎంబీకి శనివారం పంపారు. ఒకరి నుంచి రెండు శాంపిల్స్ సేకరించి ఒకటి స్విమ్స్‌, మరొకటి సీసీఎంబీకి పంపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి శ్రీహరి ఆ ఏరియాలో పర్యటించి ఫీవర్‌ సర్వేపై పలు సూచనలు చేశారు. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సోకిన వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. వేరియంట్‌ వేగంగా విస్తరించే ల‌క్ష‌ణం ఉన్నప్పటికీ ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.

ఏప్రిల్, మే నెలల్లో క‌రోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేసింది. కేసులు, మృతుల సంఖ్య వేగంగా పెరగడంతో మళ్లీ లాక్ డౌన్ విధించాల్సి వచ్చింది. ఆ పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. మెల్లిమెల్లిగా ప‌రిస్థితులు నార్మ‌ల్ అవుతున్నాయి. ప్రజల రాకపోకలు మొదలవుతున్నాయి. ఈ క్ర‌మంలో డెల్టా ప్లస్ వేరియంట్ డేంజ‌ర్ బెల్స్ మోగిస్తుంది. కొత్తగా పుట్టుకొచ్చిన డెల్టా ప్లస్, కిందటి ఏడాది తొలిసారిగా ఇండియాలో కనిపించిన డెల్టా వేరియంట్ బంధువే. ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్ పట్ల భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.  కేసులు గుర్తించిన ప్రాంతాల్లో కఠిన కంటైన్మెంట్ ఏర్పాట్లు, కాంటాక్ట్ ట్రేసింగ్ సహా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించింది. వేగంగా వ్యాప్తి చెందడం, ఊపిరితిత్తుల్లో కణాలతో గట్టి బంధం ఏర్పర్చుకునే లక్షణం, మోనోక్లోనల్ యాంటీబాడీస్ నుంచి తప్పించుకునే ప్రమాదకర లక్షణాలు ఈ వేరియంట్‌కు ఉన్నాయ‌ని కేంద్రం హెచ్చరించింది. ఈ మేర‌కు జాతీయ హెల్త్ సెక్ర‌ట‌రీ రాజేష్ భూష‌ణ్ రాష్ట్రాల చీఫ్ సెక్ర‌ట‌రీల‌కు లేఖ‌లు రాశారు. అయితే, డెల్టా ప్ల‌స్ వ‌ల్ల‌ థర్డ్ వేవ్ ముంచుకొస్తుంది అని చెప్పడానికి తగినంత డేటా ప్రస్తుతం అందుబాటులో లేదు. కానీ, వారాల తేడాతోనే పరిస్థితి మారిపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే భార‌త ప్ర‌భుత్వం ముంద‌స్థు జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది.

Also Read: జూలై 1 నుంచి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీస్‌లు పెంపు.. ఇవిగో వివ‌రాలు

లిఫ్ట్ అంటూ చెయ్యి ఎత్తుతుంది.. ఆపై మ‌డ‌త పెట్టేస్తుంది.. ‘కి’లేడీ ఆటకట్టించిన పోలీసులు