క‌రోనాకు హాట్ స్పాట్‌గా మారిన ఐఐటీ మ‌ద్రాస్‌.. 191 మందికి క‌రోనా పాజిటివ్.. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు‌

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర‌త‌ర‌మ‌వుతోంది. కోవిడ్ బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక తాజాగా ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ మ‌ద్రాస్ (ఐఐటీ మ‌ద్రాస్‌)లో క‌రోనా ...

క‌రోనాకు హాట్ స్పాట్‌గా మారిన ఐఐటీ మ‌ద్రాస్‌.. 191 మందికి క‌రోనా పాజిటివ్.. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు‌
Follow us

|

Updated on: Dec 16, 2020 | 11:18 AM

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర‌త‌ర‌మ‌వుతోంది. కోవిడ్ బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక తాజాగా ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ మ‌ద్రాస్ (ఐఐటీ మ‌ద్రాస్‌)లో క‌రోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. వైర‌స్‌కు ఎలాంటి వ్యాక్సిన్ లేని కార‌ణంగా పూర్తి స్థాయిలో క‌ట్ట‌డి కాలేక‌పోతోంది. మంగ‌ళ‌వారం నాటికి కోవిడ్ బాధితుల సంఖ్య 183 ఉండ‌గా, బుధ‌వారం నాటికి ఆ సంఖ్య 191కి చేరింది. ఇటీవ‌ల మొత్తం 514 మంది విద్యార్థుల‌కు కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, సోమ‌వారం నాటికి 104 పాజిటివ్ నిర్ధార‌ణ కాగా, మంగ‌ళ‌వారం 79 పాజిటివ్ కేసుల న‌మోదు అయ్యారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం క‌రోనా బాధితుల సంఖ్య 191కి చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు క్యాంప‌స్‌లో 700 మంది విద్యార్థులకుపైగా, 600 మంది సిబ్బందికి గానూ క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. మ‌రో ప‌ది రోజుల త‌ర్వాత మిగ‌తా 100 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఐఐటీ మ‌ద్రాస్ వెల్ల‌డించింది. ఈ క్యాంప‌స్‌లో 160 మందికిపైగా తెలుగు విద్యార్థులుండగా, అందులో 30 మందికి పాజిటివ్ నిర్ధార‌ణ అయింది.

కాగా, ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ మ‌ద్రాస్ (ఐఐటీ మ‌ద్రాస్‌) క‌రోనాకు హాట్ స్పాట్‌గా మారింది. ఇటీవ‌ల తెరుచుకున్న ఈ ఐఐటీలో క‌రోనా తిష్ట వేసింది. ప‌రీక్ష‌లు చేస్తున్న కొద్ది కోవిడ్ బారిన ప‌డేవారి సంఖ్య పెరిగిపోతోంది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఐఐటీ మ‌ద్రాస్ క్యాంప‌స్‌ను మూసి వేసిన విష‌యం తెలిసిందే. అయితే దేశంలో అన్‌లాక్ ప్ర‌క్రియ ప్రారంభం కాగానే విద్యార్థుల‌ను క్యాంప‌స్‌లోకి అనుమ‌తించారు. క‌రోనా నేప‌థ్యంలో ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని నిబంధ‌న‌లు విధించినా లాభం లేకుండా పోతోంది.

ఇక భారీ స్థాయిలో క‌రోనా కేసులు బ‌య‌ట ప‌డుతుండ‌టంతో కొద్ది రోజులుగా క్యాంప‌స్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్న‌ట్లు వ‌ర్సిటీ అధికారులు తెలిపారు. క‌రోనా బారిన ప‌డ్డ‌వారిలో అధికంగా కృష్ణ‌, జ‌మున హాస్ట‌ల్‌కు చెందిన విద్యార్థులే ఉన్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ప్ర‌స్తుతం క‌రోనా సోకిన వారంద‌రూ క్షేమంగానే ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.ష్టి పెట్టాలని అధికారులకు సర్కార్ ఆదేశాలు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు