బన్నీకి మళ్లీ నో చెప్పిన అల్లు అర్హ.. వైరల్ వీడియో

|

Jun 12, 2020 | 6:32 PM

అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ.. మళ్లీ నో చెప్పింది. ఇప్పటికి 374 సార్లు ప్రయత్నించాడట. ఆ ఒక్కటి తప్పా అంటోందట. తాజాగా బన్నీ ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో.. వరాలు, బుజ్జులు, బంగారం.. నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? అని బన్నీ ఎంతో గారాభంగా అడిగాడు. కానీ అర్హ మాత్రం.. చేసుకోను అని చెప్పి పారిపోయింది. ఇది ఇప్పటికి #374వ అటెంప్ట్ అని.. అయినా అదే సమాధానం చెబుతోందని బన్నీ అంటున్నాడు.   […]

బన్నీకి మళ్లీ నో చెప్పిన అల్లు అర్హ.. వైరల్ వీడియో
Follow us on

అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ.. మళ్లీ నో చెప్పింది. ఇప్పటికి 374 సార్లు ప్రయత్నించాడట. ఆ ఒక్కటి తప్పా అంటోందట. తాజాగా బన్నీ ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో.. వరాలు, బుజ్జులు, బంగారం.. నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? అని బన్నీ ఎంతో గారాభంగా అడిగాడు. కానీ అర్హ మాత్రం.. చేసుకోను అని చెప్పి పారిపోయింది. ఇది ఇప్పటికి #374వ అటెంప్ట్ అని.. అయినా అదే సమాధానం చెబుతోందని బన్నీ అంటున్నాడు.

మొదటి సారి…
అల్లు అర్జున్ చెప్పినట్టుగానే అన్నింటిని ఓకే చెప్పిన అల్లు అర్హ. ఒక్క పెళ్లి విషయంలో మాత్రం బన్నీకి విరుద్దంగా తల ఊపుతూ లేదు అని చెప్పింది. నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? అని బన్నీ ప్రశ్నించడం.. చేసుకోనని అల్లు అర్హ సమాధానం ఇవ్వడం అందర్నీ నవ్వించింది.

ఫ్యామిలీతో..
సినిమాలతో పాటు కుటుంబానికి ఎక్కువ ప్రధాన్యత ఇచ్చే బన్నీ.. ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా కుటంబ సభ్యులతో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. తన ఇద్దరు పిల్లలతో ఆడుకుంటున్నాడు. వారితో సరదాగా గడపుతూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు.

వైరల్‌గా మారుతున్న వీడియోలు…

అయితే అల్లు అర్హ, అల్లు అయాన్‌లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియలో తెగ వైరల్‌గా మారుతుంటాయి. ఈ చిన్నారులు చేసే అల్లరిని అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఆ మధ్య పెళ్లిపై తండ్రీ కూతుళ్ల చిట్ చాట్ వీడియోను కూడా షేర్ చేసింది. అది పెద్ద ఎత్తున వైరల్‌గా మారింది.