కరోనా కలకలం.. వారిని చూసి వణుకుతున్న తిరుపతి వాసులు

రోజు రోజుకు కరోనా మహమ్మారి విస్తరిస్తోన్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అందరిలో భయం పెరిగిపోతోంది. ఇప్పటికే ఈ వైరస్ 26 దేశాలకు విస్తరించడం.. ఈ వైరస్ సోకిన వారిలో దాదాపుగా 500మంది మృత్యువాత పడటం.. వేల మందికి పాజిటివ్ లక్షణాలు ఉండటం, ఇంకా విరుగుడును కనుక్కోకపోవడంతో అందరూ భయపడుతున్నారు. కరోనా లక్షణాల్లో ఏ లక్షణం కనిపించినా.. వెంటనే ఆసుపత్రులకు వెళ్లి టెస్టులు చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రాంతాల్లో చైనీయులను చూసినా బయపడుతున్నారు. తాజాగా తమ పరిసరాల్లో ఉంటోన్న […]

కరోనా కలకలం.. వారిని చూసి వణుకుతున్న తిరుపతి వాసులు
Follow us

| Edited By:

Updated on: Feb 05, 2020 | 1:00 PM

రోజు రోజుకు కరోనా మహమ్మారి విస్తరిస్తోన్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అందరిలో భయం పెరిగిపోతోంది. ఇప్పటికే ఈ వైరస్ 26 దేశాలకు విస్తరించడం.. ఈ వైరస్ సోకిన వారిలో దాదాపుగా 500మంది మృత్యువాత పడటం.. వేల మందికి పాజిటివ్ లక్షణాలు ఉండటం, ఇంకా విరుగుడును కనుక్కోకపోవడంతో అందరూ భయపడుతున్నారు. కరోనా లక్షణాల్లో ఏ లక్షణం కనిపించినా.. వెంటనే ఆసుపత్రులకు వెళ్లి టెస్టులు చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రాంతాల్లో చైనీయులను చూసినా బయపడుతున్నారు.

తాజాగా తమ పరిసరాల్లో ఉంటోన్న చైనీయులకు కరోనా వైద్య పరీక్షలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు తిరుపతి వాసులు. అయితే వారి విఙ్ఞప్తిని అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. తిరుచానూరు, దామినేడు ప్రాంతాల్లోని పలు అపార్ట్ మెంట్‌లలో చైనీయులు ఉండగా.. వారికి కరోనా పరీక్షలు చేయించాలని అక్కడి వారు డిమాండ్ చేస్తున్నారు.