ఏపీలో కరోనా విలయం.. 25 వేలు దాటిన కేసులు.. ఆ 4 జిల్లాల్లోనే అత్యధికం..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వెన్నులో వణుకు పుట్టించేలా విస్తరిస్తోంది. గత కొద్దిరోజులుగా వరుసగా రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1608 కరోనా కేసులు నమోదు కాగా, ఇందులో రాష్ట్రానికి చెందినవి 1576 కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారి 32 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 25,422కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 11, 936 కాగా, 13,194 మంది కరోనా నుంచి […]

ఏపీలో కరోనా విలయం.. 25 వేలు దాటిన కేసులు.. ఆ 4 జిల్లాల్లోనే అత్యధికం..
Follow us

|

Updated on: Jul 10, 2020 | 3:43 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వెన్నులో వణుకు పుట్టించేలా విస్తరిస్తోంది. గత కొద్దిరోజులుగా వరుసగా రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1608 కరోనా కేసులు నమోదు కాగా, ఇందులో రాష్ట్రానికి చెందినవి 1576 కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారి 32 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

దీనితో రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 25,422కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 11, 936 కాగా, 13,194 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో మొత్తంగా కరోనా మరణాల సంఖ్య 292కి చేరింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అనంతపురం(2850), కర్నూలు(2939), గుంటూరు(2799), తూర్పుగోదావరి(2231)లలో ఎక్కువ పాజిటివ్ కేసులు ఉండగా.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 7 జిల్లాల్లో 100కు పైగా కేసులు నమోదయ్యాయి.

ఇక కర్నూలు(93), కృష్ణ(75)లలో అత్యధిక కరోనా మరణాలు సంభవించాయి. అటు గడిచిన 24 గంటల్లో 981 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు చొప్పున.. అలాగే నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారు. ఇక నేటి వరకు రాష్ట్రంలో 11,15,635 సాంపిల్స్ పరీక్షించారు.

Also Read:

తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇంటర్ సిలబస్‌లో 30% కోత.!

భక్తులకు ముఖ్య గమనిక.. వాటి జోలికి వెళ్లొద్దంటూ టీటీడీ హెచ్చరిక..

వారంతా కంపార్ట్‌మెంటల్‌లో పాస్.. ఏపీ ఇంటర్ బోర్డు నిర్ణయం..

ఆ 8 రాష్ట్రాల్లో కరోనా స్వైరవిహారం.. లిస్టులో ఏపీ, తెలంగాణ..!

గుంటూరులో కరోనా టెర్రర్.. నేటి నుంచి కొత్త నిబంధనలు..

కేంద్రం సంచలన నిర్ణయం.. వలస కూలీల కోసం అద్దె ఇళ్లు..!