ముంబై రోడ్ల‌పై మ‌యూరాలు..అలా బంధించిన జూహిచావ్లా

బాలీవుడ్ ఫిల్మీం ఇండ‌స్ట్రీలో అత్యుత్త‌మ న‌టీమ‌ణుల‌లో ఒక‌రైనా అందాల న‌టి జూహి చావ్లా, అంతే అంద‌మైన ..

ముంబై రోడ్ల‌పై మ‌యూరాలు..అలా బంధించిన జూహిచావ్లా
Follow us

|

Updated on: Apr 02, 2020 | 3:18 PM

బాలీవుడ్ ఫిల్మీం ఇండ‌స్ట్రీలో అత్యుత్త‌మ న‌టీమ‌ణుల‌లో ఒక‌రైనా అందాల న‌టి జూహి చావ్లా, అంతే అంద‌మైన ఫోటోల‌ను సోష‌ల్‌మీడియాలో షేర్‌చేసింది. ఆ ఫోటోల‌ను చూసిన నెటిజ‌న్లు ఫిదా అయిపోతున్నారు. లైకులు, షేర్లు చేస్తూ అభిమానులు కామెంట్లు కురిపిస్తున్నారు. ఇంత‌కీ ఆమె షేర్ చేసిన ఆ ఫోటోలు ఎక్క‌డివో చెప్ప‌లేదు కాదా..! వివ‌రాల్లోకి వెళితే..
అది ముంబైలోని ఖారేఘాట్ కాల‌నీ, బాబుల్‌నాథ్ ప్రాంతం. ఎప్పుడూ ర‌ద్దీగా ఉండే ఆ ప్రాంత‌మంతా ఇప్పుడు లాక్‌డౌన్ కార‌ణంగా నిర్మూనుష్యంగా మారింది. గ‌త ప‌ది, ప‌న్నేండు రోజులుగా చిన్న శ‌బ్ధం కూడా లేకుండా ఉంది. దీంతో అక్క‌డి రోడ్ల‌పై ఇప్పుడు మ‌మూరాలు నాట్యం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా రోడ్ల మీద‌కు వ‌చ్చిన నెమ్మ‌ళ్లు..వ‌య్యారంగా పురివిప్పి ఆడుకుంటున్న దృశ్యాలు క‌నిపించాయి. అయితే, వాటిని త‌మ సెల్‌ఫోన్ కెమెరాల‌తో బంధించారు జూహిచావ్లా. అవే ఫోటోల‌ను ఆమె త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.