ఏపీ: కొత్తగా 2,237 కరోనా కేసులు, 12 మరణాలు..

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,237 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,42,967కి చేరింది.

ఏపీ: కొత్తగా 2,237 కరోనా కేసులు, 12 మరణాలు..
Follow us

|

Updated on: Nov 08, 2020 | 5:51 PM

Coronavirus Cases In AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,237 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,42,967కి చేరింది. ఇందులో 21,403 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,14,773 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 12 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,791కు చేరుకుంది. ఇక నిన్న 2,256 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 86.63 సాంపిల్స్‌ను పరీక్షించారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 109, చిత్తూరు 329, తూర్పుగోదావరి 188, గుంటూరు 364, కడప 84, కృష్ణా 277, కర్నూలు 24, నెల్లూరు 88, ప్రకాశం 83, శ్రీకాకుళం 117, విశాఖపట్నం 108, విజయనగరం 87, పశ్చిమ గోదావరి 379 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,18,589కి చేరింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 796 మంది కరోనాతో మరణించారు.

Also Read:

ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడ.? పరిశోధనకు ఆదేశించిన టీటీడీ.!

జగన్ సంచలన నిర్ణయం.. వారికి 10 రోజుల పాటు రోజుకో పధకం..

ఆ క్యాచ్ మిస్ కాకుంటే.. కథ వేరేలా ఉండేదిః కోహ్లీ

అక్కడ డిసెంబర్ 31 వరకు స్కూల్స్ మూసివేత..

మళ్లీ స్లెడ్జింగ్ చేసిన కోహ్లీ.. ఈసారి రిప్లై అదుర్స్.!

ఆ పాస్టర్లపై చర్యలు తీసుకోండి.. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం

బిగ్ బాస్ 4: హౌస్ నుంచి అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్..!