గుడ్లు తింటుండగా.. ఆగిన గుండె.. రీజన్ తెలిస్తే షాక్..!

బెట్టింగ్.. ఇది మనిషిని ఎక్కడికైనా తీసుకెళ్తుంది.. కుదిరితే కోటీశ్వరుడిని చేస్తుంది.. లేదంటే బికారిని చేస్తుంది. ఇక ఈ బెట్టింగుల్లో కొందరు వింత వింత బెట్టింగ్‌లు కట్టి.. తమ ప్రాణాలపైకే తెచ్చుకుంటారు. అయితే ఈ బెట్టింగ్‌లలో కొందరు వారి సామర్ధ్యానికి మించిన సాహసాలు చేస్తూ.. ప్రాణాలే కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. జౌన్‌పూర్‌ జిల్లాలో ఓ వ్యక్తి పందెం కాసి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. అది కూడా తినే విషయంలో.. సాధారణంగా సినిమాల్లో చూస్తూ […]

గుడ్లు తింటుండగా.. ఆగిన గుండె.. రీజన్ తెలిస్తే షాక్..!
Follow us

| Edited By:

Updated on: Nov 05, 2019 | 3:15 PM

బెట్టింగ్.. ఇది మనిషిని ఎక్కడికైనా తీసుకెళ్తుంది.. కుదిరితే కోటీశ్వరుడిని చేస్తుంది.. లేదంటే బికారిని చేస్తుంది. ఇక ఈ బెట్టింగుల్లో కొందరు వింత వింత బెట్టింగ్‌లు కట్టి.. తమ ప్రాణాలపైకే తెచ్చుకుంటారు. అయితే ఈ బెట్టింగ్‌లలో కొందరు వారి సామర్ధ్యానికి మించిన సాహసాలు చేస్తూ.. ప్రాణాలే కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

జౌన్‌పూర్‌ జిల్లాలో ఓ వ్యక్తి పందెం కాసి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. అది కూడా తినే విషయంలో.. సాధారణంగా సినిమాల్లో చూస్తూ ఉంటాం.. స్నేహితుల మధ్య తినే తిండి విషయంలో బెట్టింగ్‌లు కాసేవి. అయితే ఇక్కడ కూడా ఇలాంటి పందెం కాసి సుభాష్ యాదవ్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. సుభాష్ యాదవ్ అతని స్నేహితుడితో కలిసి.. జౌన్‌పూర్‌లోని బీబీగంజ్ మార్కెట్‌ ప్రాంతంలో గుడ్లు తినేందుకు వెళ్లాడు. అయితే అక్కడ తినే విషయంలో ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్త బెట్టింగ్‌కు దారితీసింది. ఎవరు 50 గుడ్లు తింటారో వారికి.. రూ.2000 ఇవ్వాలనే విధంగా పందెం కాసుకున్నారు.

అయితే ఈ నేపథ్యంలో సుభాష్.. 41 గుడ్లు తినేశాడు. ఇక మరో 8 గుడ్లు తింటే పందెం గెలుస్తాడనుకున్న సమయంలో విషాదం చోటుచేసుకుంది. 42వ గుడ్డు తింటూ.. అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో.. వైద్యుల సూచన మేరకు.. అతన్ని సంజయ్ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సుభాష్‌.. తన తుది శ్వాస విడిచాడు. అతిగా తినడంవల్లే సుభాష్ ప్రాణాలు కోల్పోయాడంటూ వైద్యులు వెల్లడించారు. అతి అనార్ధాలకు దారి తీస్తుందంటే ఇదే. సరదా బెట్టింగ్ కాస్తా.. తన ప్రాణాలే కోల్పోయేలా చేసింది.