కాంగ్రెస్ వాళ్లను మేమేం ఆహ్వానించలేదు.. విలీనమయ్యారు అంతే

KCR on Congress Leaders who merged in TRS, కాంగ్రెస్ వాళ్లను మేమేం ఆహ్వానించలేదు.. విలీనమయ్యారు అంతే

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు హాట్‌హాట్‌గా జరుగుతున్నాయి. తమ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ను స్పీకర్ పట్టించుకోలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. దీనికి సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. మీరిచ్చింది గాలి పిటిషన్లు కాబ్టట్టే పట్టించుకోలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరూ టీఆర్ఎస్‌లో చేరలేదని కేసీఆర్ అన్నారు. వారు టీఆర్ఎస్‌లో విలీనమయ్యారని.. రాజ్యాంగ బద్ధంగానే ఈ ప్రక్రియ జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నేతలు అర్థం లేకుండా మాట్లాడుతున్నారని కేసీఆర్ ఫైర్ అయ్యారు. తాము ముందే స్పీకర్‌కు అనర్హత పిటిషన్ ఇచ్చామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇక నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీ విలీనం చేసుకుందని.. గోవా, రాజస్థాన్‌లోనూ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కలుపుకుందని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *