‘బిగ్ బాస్ 3’పై రోజుకో రచ్చ..ఈ సారి సీన్ హెచ్చార్సీకి

రియాల్టీ టీవీ షో బిగ్ బిస్ కాస్త వివాదాల షోగా మారపోతుంది. ఇప్పటికే జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేయగా..షో కోసం తాను సినిమాలను వదులుకున్నాని..తనను మోసం చేశారని పేర్కొంటూ నటి గాయత్రి గుప్తా పోలీసులకు పిర్యాదు చేశారు. తాజాగా ‘మా టీవీ’లో ఈనెల 21న ప్రారంభం కానున్న ‘బిగ్‌బాస్‌’ షో ప్రసారాన్ని నిలిపివేయాలని కోరుతూ ఓయూ జేఏసీ ప్రతినిధులు కందుల మధు, వి.వెంకట్‌, మహేందర్‌, రామకృష్ణ గురువారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ […]

'బిగ్ బాస్ 3'పై రోజుకో రచ్చ..ఈ సారి సీన్ హెచ్చార్సీకి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 19, 2019 | 7:50 AM

రియాల్టీ టీవీ షో బిగ్ బిస్ కాస్త వివాదాల షోగా మారపోతుంది. ఇప్పటికే జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేయగా..షో కోసం తాను సినిమాలను వదులుకున్నాని..తనను మోసం చేశారని పేర్కొంటూ నటి గాయత్రి గుప్తా పోలీసులకు పిర్యాదు చేశారు. తాజాగా ‘మా టీవీ’లో ఈనెల 21న ప్రారంభం కానున్న ‘బిగ్‌బాస్‌’ షో ప్రసారాన్ని నిలిపివేయాలని కోరుతూ ఓయూ జేఏసీ ప్రతినిధులు కందుల మధు, వి.వెంకట్‌, మహేందర్‌, రామకృష్ణ గురువారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (హెచ్చార్సీ)లో ఫిర్యాదు దాఖలు చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ కార్యక్రమం కోసం పోటీదారులను ఎంపిక చేసే క్రమంలో జరిగే స్క్రీన్‌ టెస్ట్‌లో మహిళలపై లైంగిక వేధింపులు జరిగాయని ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమం చూస్తే మూడు నెలల పాటు కంటెస్టెంట్స్‌ను పూర్తిగా ఒక భవనంలో నిర్భందించి, వారి ప్రవర్తనను సీసీ కెమెరాల ద్వారా రహాస్యంగా చిత్రీకరిస్తుంటారు. ఆడవాళ్లను లైంగికంగా వాడుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

Latest Articles