మరో రెండు నెలల తరువాతే అందుబాటులోకి సీరం వ్యాక్సిన్, ప్రైవేట్ ఆసుపత్రులు, కంపెనీలకు లభ్యం

దేశంలో ప్రైవేటు ఆసుపత్రులు, కంపెనీలకు మార్చి నెలనాటికి తమ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని సీరం సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా వెల్లడించారు..

మరో రెండు నెలల తరువాతే  అందుబాటులోకి సీరం వ్యాక్సిన్, ప్రైవేట్ ఆసుపత్రులు, కంపెనీలకు లభ్యం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 04, 2021 | 5:01 PM

Covid Vaccine:దేశంలో ప్రైవేటు ఆసుపత్రులు, కంపెనీలకు మార్చి నెలనాటికి తమ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని సీరం సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా వెల్లడించారు. 50 నుంచి 60 మిలియన్ డోసుల టీకామందు అప్పటికి సిధ్ధంగా ఉంటుందన్నారు. సాధ్యమైనంత త్వరగా దీన్ని అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నామని, అయితే రెండు నెలలు ఈ సంస్థలు వెయిట్  చేయాల్సిందేనని ఆయన చెప్పారు. మొదట ప్రభుత్వ వై ఏజన్సీలకు కేవలం 200 రూపాయలకే ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్  అందజేస్తామని… కానీ ఇది తొలి వంద మిలియన్ డోసులకే నని ఆయన వివరించారు. ప్రైవేట్ మార్కెట్ లో తమ టీకామందు వెయ్యి రూపాయలకు లభ్యమవుతుందని పూనావాలా తెలిపారు. మా వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనది, నాణ్యతతో కూడుకున్నదని ఆయన అన్నారు. భారత్ బయో టెక్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ సేఫ్టీపై తలెత్తిన అనుమానాలపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు. ప్రతి వ్యాక్సిన్ ని కూడా ప్రజల ఆరోగ్యాన్ని, కోవిడ్ పై పోరును కొనసాగించాలన్న లక్ష్యంతోనే డెవలప్ చేస్తారని ఆయన పేర్కొన్నారు.

Also Read:

China Billionaire Missing : డ్రాగన్ పాలకుల తీరుపై విమర్శలు చేసి కోరి కష్టాలను తెచ్చుకున్న బిలియనీర్ అదృశ్యం..

టీవీలో రష్యా అధ్యక్షుని తల కనిపించని వైనం, న్యూ ఇయర్ మెసేజ్ ఇస్తుండగా క్రెమ్లిన్‌లో కలకలం

నేనిప్పుడే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోను, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కారణమేమిటంటే ?