‘బెర్ముడా ట్రయాంగిల్‌’లో చిక్కుకొని.. ఆ వ్యక్తి నిజంగా మృత్యుంజయుడే

ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని రహస్యాలలో బెర్ముడా ట్రయాంగిల్ ఒకటి. ఇప్పటివరకు ఆ ట్రయాంగిల్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లిన పెద్ద పెద్ద ఓడలు, విమానాలు అదృశ్యమయ్యాయి. అవి ఎలా అదృశ్యమయ్యాయి అన్న రహస్యంపై ఇప్పటికీ శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతటి భయంకర ప్రదేశాన్ని పోలింది ఆసియా ఖండంలో కూడా ఒకటుంది. పెంగు ఐల్యాండ్‌లోని ఓ ప్రాంతానికి బెర్ముడా ట్రయాంగిల్ ఆఫ్ ఆసియా అని పేరుంది. ఇక్కడ కూడా బెర్ముండా ట్రయాంగిల్‌లో మాదిరిగా పెద్ద గాలులు, భారీ […]

‘బెర్ముడా ట్రయాంగిల్‌’లో చిక్కుకొని.. ఆ వ్యక్తి నిజంగా మృత్యుంజయుడే
Follow us

| Edited By:

Updated on: Jun 15, 2019 | 12:44 PM

ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని రహస్యాలలో బెర్ముడా ట్రయాంగిల్ ఒకటి. ఇప్పటివరకు ఆ ట్రయాంగిల్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లిన పెద్ద పెద్ద ఓడలు, విమానాలు అదృశ్యమయ్యాయి. అవి ఎలా అదృశ్యమయ్యాయి అన్న రహస్యంపై ఇప్పటికీ శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతటి భయంకర ప్రదేశాన్ని పోలింది ఆసియా ఖండంలో కూడా ఒకటుంది. పెంగు ఐల్యాండ్‌లోని ఓ ప్రాంతానికి బెర్ముడా ట్రయాంగిల్ ఆఫ్ ఆసియా అని పేరుంది. ఇక్కడ కూడా బెర్ముండా ట్రయాంగిల్‌లో మాదిరిగా పెద్ద గాలులు, భారీ అలలు వస్తుంటాయి. అందుకే దీనిని బెర్ముడా ట్రయాంగిల్ ఆఫ్ ఆసియా అని పిలుస్తారు. అంతేకాదు ఇక్కడకు వెళ్లిన పలు ఓడలు అదృశ్యమైన రికార్డులు ఉన్నాయి. అలాంటిది ఆ ప్రాంతంలో చిక్కుకొని 11 రోజుల తరువాత మృత్యుంజయుడిగా ఇంటికి చేరాడు చైనాకు చెందిన ఓ మత్స్యకారుడు. దీంతో ఇప్పుడు అతడి పేరు చైనాలో మారుమోగిపోతుంది.

చైనాకు దక్షిణాదిన ఉన్న ఓ సముద్రంలో చేపలు పట్టేందుకు మే 10న ఇంటి నుంచి వెళ్లాడు నియాన్ జిన్‌గువా(52). ఆ తరువాత పెంగు ఐల్యాండ్‌లోని ‘బెర్ముడా ట్రయాంగిల్ ఆఫ్ ఆసియా’లో చిక్కుకున్నాడు. దీంతో అక్కడి నుంచి బయటపడేందుకు నియాన్ చిన్నపాటి యుద్ధమే చేశాడు. తన కోసం తెచ్చుకున్న ఆహారం, నీరు అయిపోవడంతో.. తన మూత్రాన్నే(యూరిన్) తాగి, ఆహారంగా చేపలను పట్టేందుకు ఉపయోగించే ఎరను తిన్నాడు. ఇక తన బోటులో ఉన్న ఫ్యూయల్ అయిపోవడంతో పాటు సెల్‌లో ఉన్న బ్యాటరీ కూడా అయిపోవడంతో ఏమీ చేయలేకపోయాడు. దీంతో ప్రాణాల మీద ఆశలు వదులుకున్నప్పటికీ.. ఎవరైనా వచ్చి ఆదుకోకపోతారా..? అన్న చిన్న ఆశతో గడిపాడు. అయితే అతడి ఆశలు ఫలించి.. మే 21న అటుగా వెళ్లిన మరో బోటు నియాన్‌ను గుర్తించి స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లింది. ప్రాథమిక చికిత్స చేసిన డాక్టర్లు అతడిని మే 23న డిశ్చార్జ్ చేశారు.

ఇదిలా ఉంటే బెర్ముడా ట్రయాంగిల్‌లో అతడు తప్పిపోయి 10 రోజులు అవ్వడంతో ఆశలు పోగొట్టుకున్న నియాన్ కుటుంబసభ్యులు అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. అలాంటి సమయంలో అతడు మృత్యుంజయుడిగా ఇంటికి రావడంతో కుటుంబం సంతోషంలో ముగినిపోయింది. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి కుదుటుగా ఉందని డాక్టర్లు నిర్ధారించారు. అయితే అక్కడకు వెళ్లిన ఎవరూ ఇంతవరకు తిరిగిరాలేదని.. కానీ అంతటి అలల నుంచి నియాన్ బయటపడటం అదృష్టమని.. నిజంగా అతడు మృత్యుంజయుడంటూ.. అతడిని కాపాడిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Latest Articles
షాకింగ్ యాక్సిడెంట్.. రెప్పపాటులో పెను ప్రమాదం.. వీడియో వైరల్
షాకింగ్ యాక్సిడెంట్.. రెప్పపాటులో పెను ప్రమాదం.. వీడియో వైరల్
వీడియో చూస్తే నమ్మలేరు.. నిజంగా టీ అమ్మి కోటీశ్వరుడైన చాయ్ వాలా
వీడియో చూస్తే నమ్మలేరు.. నిజంగా టీ అమ్మి కోటీశ్వరుడైన చాయ్ వాలా
ఆకులు కాదు ఇవి బ్రహ్మాస్త్రాలు.. ఉదయాన్నే పరగడుపున నాలుగు తింటే..
ఆకులు కాదు ఇవి బ్రహ్మాస్త్రాలు.. ఉదయాన్నే పరగడుపున నాలుగు తింటే..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పంజా మూవీ హీరోయిన్..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పంజా మూవీ హీరోయిన్..
అకాల వర్షం అన్నదాత కంట కన్నీరు.. బోరుమంటున్న రైతులు..
అకాల వర్షం అన్నదాత కంట కన్నీరు.. బోరుమంటున్న రైతులు..
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
మీకు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసా..? రిస్క్ తక్కువ లాభం ఎక్కువ
మీకు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసా..? రిస్క్ తక్కువ లాభం ఎక్కువ