Chandrayaan 2: చంద్రుడిపై బిలం.. ‘విక్రమ్ సారాభాయ్’‌ పేరును పెట్టిన నాసా

చందమామపై పరిశోధనలకు గానూ గతేడాది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చంద్రయాన్‌ 2ను ప్రయోగించిన విషయం తెలిసిందే.

Chandrayaan 2: చంద్రుడిపై బిలం.. 'విక్రమ్ సారాభాయ్'‌ పేరును పెట్టిన నాసా
Follow us

| Edited By:

Updated on: Aug 15, 2020 | 4:49 PM

Chandrayaan 2 Captures crater: చందమామపై పరిశోధనలకు గానూ గతేడాది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చంద్రయాన్‌ 2ను ప్రయోగించిన విషయం తెలిసిందే. చంద్రుడి ఉపరితలంపై దిగుతూ గమ్యస్థానానికి  2.5కిలోమీటర్ల దూరంలో ఉండగా.. విక్రమ్ ల్యాండర్ క్రాష్ అయ్యింది. దీంతో అక్కడి నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. అయితే ఆర్బిటర్‌ మాత్రం చంద్రుడి కక్ష్య చుట్టూ తిరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఫొటోలను పంపుతోంది. తాజాగా ఆర్బిటర్‌లోని కెమెరా చంద్రుడి ఉపరితలంపై ఓ బిలం ఫొటోలను పంపింది. అమెరికా అపోలో 17, రష్యా లూనా 21 మిషన్ ల్యాండింగ్ సైట్‌కు తూర్పున 300 కిలోమీటర్ల దూరంలో ఈ బిలాన్ని గుర్తించగా.. దానికి భారత అంతరిక్ష ప్రయోగాల పితామహుడు విక్రమ్ సారాభాయ్‌ పేరును పెట్టింది. దీనిపై అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ మాట్లాడుతూ.. ”ఆగష్టు 12 నాటికి సారాభాయ్‌ శతజయంతి పూర్తి అయ్యింది. ఆ గొప్ప శాస్త్రవేత్తకు ఇది ఘనమైన నివాళి” అని అన్నారు.

Read More:

క్షీణించిన మంత్రి, మాజీ క్రికెటర్‌ చేతన్ చౌహాన్ ఆరోగ్యం

‘కార్గిల్ గర్ల్‌’ మేకర్లు క్షమాపణలు చెప్పాల్సిందే