Breaking News
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 45,143 మంది భక్తులు.
  • హైదరాబాద్‌: గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సన్నీబాబు ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు బావ సంపత్‌కు సన్నీబాబు ఈ మెయిల్‌. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో గానాబజానా వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహం. ఆరుగురు సిబ్బందిపై శాఖాపరమైన విచారణ చేపట్టిన వైద్యారోగ్యశాఖ. హెడ్‌ నర్సులు, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌లు, ఫార్మాసిస్ట్‌లపై.. చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ.
  • వరంగల్‌: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు. 436 హుండీల లెక్కింపు పూర్తి. రూ.10.29 కోట్ల ఆదాయం.
  • రామాయపట్నం పోర్టు పరిధిని నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. పోర్టు జియో కోఆర్డినేట్స్‌ను నోటిఫై చేసిన మౌలిక వనరులకల్పన శాఖ. పోర్టు నిర్మించిన ప్రాంతానికి 30 కి.మీ. పరిధిలో.. మరో ఓడరేవు నిర్మించేందుకు వీల్లేకుండా అంగీకారం. రామాయపట్నం పోర్టు నిర్మాణంపై.. డీపీఆర్‌ రూపకల్పనలో భాగంగా పోర్టు పరిధి నిర్ధారిస్తూ ఉత్తర్వులు. ప్రభుత్వానికి వివిధ ప్రతిపాదనలు పంపిన ఏపీ మారిటైమ్‌ బోర్డు. నాన్‌ మేజర్‌ పోర్టుగా రామాయపట్నంను అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం.
  • హైదరాబాద్‌: సీసీఎస్‌ పోలీసులకు కరాటే కల్యాణి ఫిర్యాదు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తనను అసభ్యపదజాలంతో దూషించిందని ఫిర్యాదు. శ్రీరెడ్డిపై 506, 509 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు. సోషల్‌ మీడియాలో అసభ్య కామెంట్స్ చేయడం చట్టరీత్యా నేరం. సపోర్టింగ్‌ కామెంట్స్ చేసినవారిపై కూడా చర్యలు తీసుకుంటాం -సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ ప్రసాద్.

రాహుల్ గాంధీకి షాకింగ్ న్యూస్… హోం శాఖ ఏంచేసిందంటే..?

Centre Tweaks Security Rules for Gandhis.. Says SPG Must Accompany Them at All Times on Foreign Trips, రాహుల్ గాంధీకి షాకింగ్ న్యూస్…  హోం శాఖ ఏంచేసిందంటే..?

కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీకి భారీ ఝలక్ ఇచ్చింది. అలాంటి ఇలాంటి ఝలక్ కాదు.. ఇక ఆయన ఎక్కడికి వెళ్లినా.. ఆయన వెంట ఎస్పీజీ కమాండోలు వెన్నంటే ఉంటారు. ఇక రహస్య టూర్‌లు వెళ్లడానికి కూడా వీళ్లేదు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి ఈ ఎస్పీజీ కమాండోలు వెళ్తారు. అయితే ఇదేంటీ ఎస్పీజీ కమాండోలు రాహుల్ కుటుంబానికి రక్షణగా ఉన్నారు కదా.. అని అనుకునేరు.. ఇప్పటి వరకు ఎస్పీజీ భద్రత ఉన్నా.. వారు విదేశీ టూర్‌లు వెళ్లే ముందు వారిని వెనక్కి పంపేవారు. అయితే రహస్య టూర్‌లకు చెక్ పెడుతూ కేంద్ర షాకింగ్ న్యూస్ తెలిపింది. దేశంలో అత్యంత ప్రముఖులకు ఇచ్చే స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ) నిబంధనలను కేంద్ర హోం శాఖ తాజాగా సవరించింది. దీంతో కొత్త నిబంధనల ప్రకారం వీవీఐపీలు(ఎస్పీజీ భద్రత కల్గిన వారు) ఇక నుంచి విదేశీ పర్యటనలకు వెళ్లినపుడు ఎస్‌పీజీ సిబ్బంది వారిని డేగకన్నులా వెంటనే ఉంటుంది.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత 1985లో ఈ ఎస్‌పీజీ భద్రతని ఏర్పాటు చేశారు. మాజీ ప్రధాని కుటుంబ సభ్యుల హోదాలో రాహుల్‌ గాంధీకి కూడా ఎస్పీజీ భద్రత ఉంది. ప్రతినిత్యం ఆయనకు భద్రతా కమాండోలు రక్షణ కల్పిస్తుంటారు. అయితే రాహుల్ గాంధీ ఎస్పీజీ కమాండోలను తనతో విదేశాలకు రానివ్వడం లేదు. సడన్‌గా విదేశీ టూర్లు ప్లాన్ చేసుకుని.. వెళ్లడం.. మళ్లీ కొద్ది రోజులుగా ఎవరికీ టచ్‌లో లేకుండా ఉండటం.. ఆయన ఎక్కడ తిరుగుతారో ఎవరికీ తెలియనివ్వకపోవడం.. ఇది గతకొద్ది రోజులుగా రాహుల్ తీరు.

అయితే ఈ మధ్య కాంబోడియా పర్యటన నిమిత్తం రాహుల్ గాంధీ వెళ్లారు. ఆ సమయంలోనే వీవీఐపీల భద్రతా నిబంధనలను ప్రభుత్వం సవరించింది. ఇప్పటిదాకా విదేశాలకు వెళ్తే ఎస్పీజీ సిబ్బందిని కొన్ని ప్రదేశాలకు వారితో రాకుండా వీవీఐపీలు నియంత్రించే వారు. కానీ సవరించని నిబంధనల కారణంగా ఇక ప్రతిక్షణం వీవీఐపీల వెన్నంటే ఉండనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ చర్యలు తీసుకొంటున్నట్లు ప్రభుత్వం చెప్తోంది.

అంతేకాదు.. ఒకవేళ ఎస్‌పీజీ సిబ్బందిని అనుమతించకపోతే వారి విదేశీ టూర్‌లను ఇక నుంచి కేంద్రం నియంత్రించే అవకాశం ఉంది. గాంధీ కుటుంబీకులు ఇప్పటి దాకా విదేశాలకు వెళ్లినపుడు వారు మొదట గమ్యస్థానం చేరేవరకు ఎస్‌పీజీ సిబ్బంది వారిని అనుసరిస్తూ రక్షణ కల్పించేవారు. అక్కడినుంచి ఎస్‌పీజీ సిబ్బందిని వెనక్కి పంపి వారు వెళ్లాల్సిన ప్రదేశాలకు వెళ్లి పర్యటనలు ముగించకొని వచ్చేవారు. అయితే సవరించిన భద్రతా నియమాల కారణంగా వీవీఐపీల రహస్య పర్యటనలకు ఇబ్బందులు ఏర్పడనున్నాయి.

Related Tags