దుబ్బాకలో ఈసీ జోక్యం చేసుకోవాలిః డీకే అరుణ

దుబ్బాక ఉపఎన్నికలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం జోక్యం చేసుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కోరారు.

దుబ్బాకలో ఈసీ జోక్యం చేసుకోవాలిః డీకే అరుణ
Follow us

|

Updated on: Oct 27, 2020 | 1:54 PM

దుబ్బాక ఉపఎన్నికలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం జోక్యం చేసుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కోరారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘనందన్‌రావు బంధువుల ఇళ్ళలో సోదాలను ఖండిస్తున్నామని ప్రకటించారు. బీజేపీ నేతల ఇళ్లను మాత్రమే పోలీసులు టార్గెట్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్న డీకే అరుణ.. టీఆర్ఎస్‌ను ఓడించి దుబ్బాక ప్రజలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలవనున్నారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో, కార్యాలయాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. సిద్దిపేటలో రఘునందన్‌రావు బంధువుల ఇంట్లో రూ.18.67 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో డీకే అరుణ స్పందించి కేంద్ర సంఘం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.