సెన్సార్ దెబ్బకు 793 చిత్రాలు ఔట్..!

లక్నో: సెంట్రల్ బోర్డు అఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సిబిఎఫ్సి) గడిచిన 16 ఏళ్లలో ఏకంగా 793 చిత్రాలను బ్యాన్ చేసిందని ఆర్టిఐ అధికారి నూతన్ ఠాకూర్ వెల్లడించారు. సెన్సార్ రూల్స్ ని పాటించని కారణంగా ఈ సినిమాలు విడుదలకు నోచుకోలేదట. సెన్సార్ బోర్డు ను కూడా దాటని ఈ చిత్రాలు ఇక ఎప్పటికి విడుదల అవ్వనని చెప్పాలి. అసలు విషయంలోకి వెళ్తే నూతన్ ఠాకూర్ సీబీఎఫ్ సి ని సెన్సార్ విషయంలో ప్రశ్నించాడు.  ఈ 16 ఏళ్లలో 586 ఇండియన్ […]

సెన్సార్ దెబ్బకు 793 చిత్రాలు ఔట్..!
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:56 PM

లక్నో: సెంట్రల్ బోర్డు అఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సిబిఎఫ్సి) గడిచిన 16 ఏళ్లలో ఏకంగా 793 చిత్రాలను బ్యాన్ చేసిందని ఆర్టిఐ అధికారి నూతన్ ఠాకూర్ వెల్లడించారు. సెన్సార్ రూల్స్ ని పాటించని కారణంగా ఈ సినిమాలు విడుదలకు నోచుకోలేదట. సెన్సార్ బోర్డు ను కూడా దాటని ఈ చిత్రాలు ఇక ఎప్పటికి విడుదల అవ్వనని చెప్పాలి.

అసలు విషయంలోకి వెళ్తే నూతన్ ఠాకూర్ సీబీఎఫ్ సి ని సెన్సార్ విషయంలో ప్రశ్నించాడు.  ఈ 16 ఏళ్లలో 586 ఇండియన్ సినిమాలను.. 207 విదేశీ సినిమాలను బ్యాన్ చేశామని సెన్సార్ బోర్డు వెల్లడించింది. ఇక బ్యాన్ అయిన 586 ఇండియన్ సినిమాల్లో 231 హిందీ సినిమాలు సెన్సార్ బోర్డు దాటలేకపోయాయి. ఆ తర్వాత 96 తమిళం, 53 తెలుగు, 39 కన్నడ, 23 మలయాళం, 17 పంజాబీ చిత్రాలకు సెంట్రల్ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వలేదట. ఈ అన్ని సినిమాల్లోనూ అతి శృంగారం, అతి హింస ఉన్నాయట. కొన్ని సినిమాలైతే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉండడం వల్ల విడుదలకు నో చెప్పిందట సెన్సార్ బోర్డు. 2015-16 సంవత్సరం గానూ అత్యధికంగా 153 చిత్రాలు ఉండడం విశేషం.