TSPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో నోటిఫికేషన్.. ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలంటే..

|

Sep 07, 2022 | 9:16 PM

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల వివిధ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీచేస్తూ వస్తోంది. తాజాగా టీఎస్ పీఎస్సీ(TSPSC) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగ ప్రకటన ద్వారా మున్సిపల్ శాఖలో పలు..

TSPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో నోటిఫికేషన్.. ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలంటే..
TSPSC Group I hall tickets
Follow us on

TSPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల వివిధ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీచేస్తూ వస్తోంది. తాజాగా టీఎస్ పీఎస్సీ(TSPSC) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగ ప్రకటన ద్వారా మున్సిపల్ శాఖలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇటీవలే మహిళా, శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. తాజాగా మున్సిపల్ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మున్సిపల్ శాఖలో 175 టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీస్‌ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈనెల 20వ తేదీ నుంచి అక్టోబరు 13 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్హత, దరఖాస్తు రుసుం తదితర వివరాలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. లేదా ఇక్కడి లింక్ క్లిక్ చేసి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్ ను నేరుగా సందర్శించవచ్చు.

Tspsc

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.