టెట్‌ ఫెయిలైన ప్రభుత్వ బడి టీచర్లకు అలర్ట్.. స్పెషల్ TET 2026కు నేటి నుంచే దరఖాస్తులు

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న టీచర్ల కోసం విద్యాశాఖ స్పెషల్ టెట్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. యేటా రెండు సార్లు స్పెషల్ టెట్‌ నిర్వహిస్తామని ఇప్పటికే రేవంత్‌ సర్కాన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ నవీన్‌ నికోలస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు...

టెట్‌ ఫెయిలైన ప్రభుత్వ బడి టీచర్లకు అలర్ట్.. స్పెషల్ TET 2026కు నేటి నుంచే దరఖాస్తులు
Telangana Special TET Notification

Updated on: Jul 22, 2026 | 8:10 AM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న టీచర్ల కోసం విద్యాశాఖ స్పెషల్ టెట్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. యేటా రెండు సార్లు స్పెషల్ టెట్‌ నిర్వహిస్తామని ఇప్పటికే రేవంత్‌ సర్కాన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ నవీన్‌ నికోలస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, టీజీఆర్‌ఈఐఎస్‌, ప్రభుత్వ సంక్షేమ సొసైటీస్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌, తెలంగాణ మోడల్‌ స్కూల్స్‌, ఇతర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రమే ఈ టెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అంటే బీఎడ్‌, డీఎడ్‌ పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్ధులు ఈ టెట్ రాసేందుకు అవకాశం ఉండదన్నమాట. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం సర్కార్ టీచర్లు స్పెషల్ టెట్‌ రాసేందుకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు జులై 22, 2026వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణ స్పెషల్ TET 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జులై 29, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దరఖాస్తు సమయంలో పరీక్ష ఫీజు కింద జనరల్‌, బీసీ అభ్యర్థులు రూ.750, రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకునే వారు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఒక్కో పేపర్‌కు రూ.700, రెండు పేపర్లకు రూ.950 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఇక స్పెషల్ టెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు సెప్టెంబర్‌ 7 నుంచి 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో రోజుకు రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. మొదటి సెషన్‌ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, రెండో సెషన్‌ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటుంది. ఆగస్టు 31 నుంచి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించేవారు పేపర్‌ 1, ఆరు నుంచి ఎనిమిది తరగతులకు బోధించేవారు పేపర్‌ 2 పరీక్ష రాయాల్సి ఉంటుంది. టీచర్లు తాము ఏ పేపర్‌లో అర్హత సాధించవల్సి ఉందో తమ ఆసక్తిని బట్టి ఆయా పేపర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా విధుల్లో ఉన్న ప్రభుత్వ టీచర్లు 2028, ఆగస్ట్ 31 నాటికి టెట్‌లో అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

తెలంగాణ స్పెషల్ టెట్ 2026 పరీక్షల షెడ్యూల్‌ ఇదే..

  • స్పెషల్ టెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభ తేదీ: జులై 22, 2026.
  • స్పెషల్ టెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 29, 2026.
  • టెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షల తేదీలు: సెప్టెంబరు 7 నుంచి 11 వరకు
  • స్పెషల్ టెట్‌ ఫలితాల వెల్లడి: సెప్టెంబరు 28, 29, 30 తేదీల్లో విడుదల
Loading...
Unable to load recommendations.
Follow Us