ఇంటర్ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఫలితాల విడుదల తేదీలు మార్పు.. రిజల్ట్స్ వచ్చేది అప్పుడే..

పరీక్షలు రాసిన అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇంటర్ ఫలితాలు త్వరలోనే రాబోతున్నాయి. ఫలితాల విడుదలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. ఈ వారం కాకుండా, వచ్చే వారం ఏప్రిల్ 12-15 మధ్య తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెలువడే అవకాశముంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఆధారంగా అధికారిక తేదీని త్వరలో ప్రకటించనున్నారు అధికారులు.

ఇంటర్ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఫలితాల విడుదల తేదీలు మార్పు.. రిజల్ట్స్ వచ్చేది అప్పుడే..
Telangana Inter Results 2026

Edited By:

Updated on: Apr 07, 2026 | 11:59 AM

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాల విడుదలపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ వారం ఫలితాలు వస్తాయని ఆశించిన విద్యార్థులు మరికొన్ని రోజులు నిరీక్షించక తప్పదు. తాజా సమాచారం ప్రకారం.. వచ్చే వారం తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 12 నుంచి 15వ తేదీ మధ్యలో ఫలితాలను వెల్లడించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మరో రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తిగా ముగియనుంది.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఫలితాల విషయంలో ఇంటర్ బోర్డు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఎలాంటి సాంకేతిక లోపాలు లేదా మార్కుల లెక్కింపులో తప్పులు దొర్లకుండా డబుల్ చెక్ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇప్పటికే ఒకసారి వాల్యూయేషన్ పూర్తయినప్పటికీ, అత్యున్నత ప్రమాణాల కోసం మరోసారి ఫలితాలను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా కేవలం ఒకే ఒక్క పేపర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థుల విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. అటువంటి విద్యార్థుల సమాధాన పత్రాలను మరోసారి రీ-వాల్యూయేషన్ చేయిస్తున్నారు. దీనివల్ల పొరపాట్లు జరిగి విద్యార్థులు నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

ఫలితాల వెల్లడికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. వచ్చే వారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్, ఆయన లభ్యత ఆధారంగా ఫలితాల తేదీని అధికారికంగా ఖరారు చేయనున్నారు. సిఎం చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు టీవీ9 తెలుగు వెబ్ సైట్‌తో పాటు అధికారిక వెబ్ సైట్లలో తమ మార్కులను చూసుకోవచ్చు. మొత్తానికి స్కాన్ కాపీల అప్ లోడింగ్, డేటా ప్రాసెసింగ్ అంతా వేగంగా జరుగుతుండటంతో, విద్యార్థులు తమ ఫలితాల కోసం సిద్ధంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us