విద్యార్ధులకు అలర్ట్.. TG EAPCET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసిందోచ్! రిజిస్ట్రేషన్లు ఎప్పట్నుంచంటే..

TGEAPCET 2026 Counselling Scheudle: రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అలర్ట్.. TGEAPCET-2026 అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. సోమవారం హైదరాబాద్‌లోని మసాబ్ ట్యాంక్ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిస్టా రెడ్డి అధ్యక్షతన జరిగిన అడ్మిషన్ కమిటీ..

విద్యార్ధులకు అలర్ట్.. TG EAPCET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసిందోచ్! రిజిస్ట్రేషన్లు ఎప్పట్నుంచంటే..
TG EAPCET Counselling Schedule

Edited By:

Updated on: Jun 08, 2026 | 8:25 PM

హైదరాబాద్‌, జూన్‌ 8: తెలంగాణలో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అలర్ట్. TGEAPCET-2026 అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. సోమవారం హైదరాబాద్‌లోని మసాబ్ ట్యాంక్ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిస్టా రెడ్డి అధ్యక్షతన జరిగిన అడ్మిషన్ కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజా షెడ్యూల్ ప్రకారం.. జూన్ 19 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి మూడు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం ఇంటర్నల్ స్లైడింగ్, స్పాట్ అడ్మిషన్లు ఉంటాయి.

మొదటి విడత షెడ్యూల్

  • జూన్ 19 నుండి జూన్ 28: ఆన్‌లైన్‌లో బేసిక్ ఇన్ఫర్మేషన్ నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్.
  • జూన్ 22 నుండి జూన్ 29: స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు హెల్ప్ లైన్ కేంద్రాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్.
  • జూన్ 25 నుండి జూలై 1: వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ. జూలై 1: వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్.
  • జూలై 4 న లేదా అంతకుముందు: మాక్ సీట్ అలోట్‌మెంట్ ప్రదర్శన.
  • జూలై 5 నుండి జూలై 7: మాక్ అలోట్‌మెంట్ ఆధారంగా విద్యార్థులు తమ ఆప్షన్లను మార్చుకునేందుకు అవకాశం.
  • జూలై 7: మొదటి విడత సీట్ల కేటాయింపు కోసం ఆప్షన్ల ఫ్రీజింగ్.
  • జూలై 10 న లేదా అంతకుముందు: మొదటి విడత ప్రొవిజనల్ సీట్ల కేటాయింపు.
  • జూలై 10 నుండి జూలై 14: ఆన్‌లైన్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్.

రెండో విడత షెడ్యూల్

  • జూలై 17: మొదటి విడతలో పాల్గొనని వారి కోసం ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్.
  • జూలై 18: సర్టిఫికేట్ వెరిఫికేషన్.
  • జూలై 18 నుండి జూలై 19: రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదు
  • జూలై 19: ఆప్షన్ల ఫ్రీజింగ్.
  • జూలై 22 న లేదా అంతకుముందు: రెండో విడత సీట్ల కేటాయింపు.
  • జూలై 22 నుండి జూలై 24: ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్.
  • జూలై 25 నుండి జూలై 28: కేటాయించిన కాలేజీల్లో ఒరిజినల్ టి.సి (T.C), జెరాక్స్ సర్టిఫికేట్లతో అభ్యర్థులు నేరుగా ఫిజికల్ రిపోర్టింగ్ చేయడం తప్పనిసరి.
  • జూలై 28: సీట్ల రద్దుకు చివరి తేదీ.

ఫైనల్ విడత షెడ్యూల్

  • జూలై 31: మిగిలిపోయిన అభ్యర్థులకు స్లాట్ బుకింగ్.
  • ఆగస్టు 1: సర్టిఫికేట్ వెరిఫికేషన్.
  • ఆగస్టు 1 నుండి ఆగస్టు 2: కొత్తగా ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్ల నమోదు.
  • ఆగస్టు 2: ఆప్షన్ల ఫ్రీజింగ్.
  • ఆగస్టు 5 న లేదా అంతకుముందు: ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు.
  • ఆగస్టు 5 నుండి ఆగస్టు 7: ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ మరియు బ్రాంచ్/కాలేజీ మారిన వారు కొత్త కాలేజీలో రిపోర్ట్ చేయడం.
Follow Us