TG PGECET 2026 Postponed: టీజీ పీజీఈసెట్‌ ప్రవేశ పరీక్ష వాయిదా.. కారణం ఇదే! కొత్త షెడ్యూల్‌ చూశారా

TG PGECET 2026 revised schedule: పీజీఈసెట్‌ 2026 పరీక్ష వాయిదా వేస్తున్నట్లు జేఎన్‌టీయూ హైదరాబాద్‌ ప్రకటించింది. బక్రీద్ పండగ నేపథ్యంలో షెడ్యూల్‌లో కీలక మార్పు చోటుచేసుకుంటున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు మే 28వ తేదీన నిర్వహించాల్సిన..

TG PGECET 2026 Postponed: టీజీ పీజీఈసెట్‌ ప్రవేశ పరీక్ష వాయిదా.. కారణం ఇదే! కొత్త షెడ్యూల్‌ చూశారా
TG PGECET exam postponed

Updated on: May 20, 2026 | 8:12 AM

హైదరాబాద్, మే 20: తెలంగాణ పీజీఈసెట్‌ 2026 (TG PGECET) పరీక్ష వాయిదా వేస్తున్నట్లు జేఎన్‌టీయూ హైదరాబాద్‌ ప్రకటించింది. బక్రీద్ పండగ నేపథ్యంలో షెడ్యూల్‌లో కీలక మార్పు చోటుచేసుకుంటున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు మే 28వ తేదీన నిర్వహించాల్సిన ఈ పరీక్షను జూన్‌ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కె వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం మే 29, 30, 31 తేదీల్లో ఈ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో జరగాల్సి ఉంది. కేవలం 28వ తేదీన జరగవల్సిన పరీక్షను మాత్రమే జూన్‌ 1వ తేదీన నిర్వహిస్తారు. మిగతా పరీక్షలు ఎలాంటి మార్పు లేకుండా యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల్లో కంప్యూటర్‌ సైన్స్, ఫార్మసీ, సివిల్, ఈసీఈ, మెకానికల్ తదితర పీజీ కోర్సుల్లో 2026-27 విద్యాసంవత్సరానికి గానూ ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 26,005 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. షెడ్యూల్‌లో చోటు చేసుకున్న ఈ మార్పులు గమనించాలని కన్వీనర్ ప్రొఫెసర్‌ కె వెంకటేశ్వరరావు తెలిపారు. మే 28 నాటి పరీక్షను మాత్రమే జూన్ 1కి మార్చారు. మిగిలిన తేదీల పరీక్షల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. పరీక్షల షిఫ్ట్ సమయాల్లోనూ ఎలాంటి మార్పు ఉండదని కౌన్సిల్ స్పష్టం చేసింది. ఉదయం సెషన్ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు యధావిధిగా జరుగుతుంది.

పరీక్షకు నమోదు చేసుకున్న అభ్యర్థులు మే 22, 2026న ఉదయం 11 గంటల నుండి అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని కౌన్సిల్ ప్రకటించింది. అభ్యర్థులు అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత, దానిపై పేర్కొన్న అన్ని వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలని సూచించింది. పరీక్ష తేదీ, కేంద్రం, సమయం వివరాలను హాల్‌టికెట్‌లో జాగ్రత్తగా సరిచూసుకోవాలని, ఏవైనా ఇబ్బందులు ఉంటే అధికారులను సంప్రదించాలని సూచించింది.

ఇవి కూడా చదవండి

టీజీ పీజీఈసెట్‌ 2026 హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us