TG EAPCET 2026 Notification: విద్యార్ధులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లోనే ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

రాష్ట్ర ఈఏపీసెట్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ మరో 2 రోజుల్లో విడుదల కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ప్రకటన వెలువరించింది. తాజా ప్రకటన మేరకు ఫిబ్రవరి 14వ తేదీన తెలంగాణ ఈఏపీసెట్‌ 2026 పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలకానుంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి..

TG EAPCET 2026 Notification: విద్యార్ధులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లోనే ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల
Telangana EAPCET 2026 Notification

Updated on: Feb 12, 2026 | 6:53 AM

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో 2026-27 విద్యాసంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్‌)కు సంబంధించిన నోటిఫికేషన్‌ మరో 2 రోజుల్లో విడుదల కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ప్రకటన వెలువరించింది. తాజా ప్రకటన మేరకు ఫిబ్రవరి 14వ తేదీన తెలంగాణ ఈఏపీసెట్‌ 2026 పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలకానుంది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 4, 2026వ తేదీ వరకు కొనసాగుతాయి. పరీక్ష కేంద్రాలు, సిలబస్‌పై ఇప్పటికే అధికారులు కసరత్తు పూర్తి చేశారు.

ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు రాసే విద్యార్థులు ఈఏపీ సెట్‌కు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దీంతో ఇంటర్‌ హాల్‌టికెట్ల నంబర్ల ద్వారా పూర్తి డేటా తీసుకుంటారు. ఈ క్రమంలో సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ విజయకుమార్‌ రెడ్డి బుధవారం ఇంటర్‌ బోర్డు అధికారులతో మాట్లాడారు. నోటిఫికేషన్‌ను దృష్టిలో ఉంచుకుని హాల్‌టికెట్లు పూర్తి డేటాతో ఆన్‌లైన్‌లో ఉంచాలని సూచించారు. ఈసారి పరీక్షలకు హాజరయ్యే బాలికలకు దగ్గరి ప్రాంతాల్లోనే పరీక్ష కేంద్రాలు కేటాయించేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సెట్‌ అధికారులు తెలిపారు. ముందస్తుగా దరఖాస్తు చేసే వారికి మొదటి ప్రాధాన్యం కింద పరీక్ష కేంద్రాన్ని కేటాయించే వీలుంటుందని అన్నారు.

అంతేకాకుండా ఈఏపీసెట్‌ పరీక్షలో ఈ ఏడాది మరో కీలక మార్పు కూడా చేశారు. ఆన్‌లైన్‌లో ఈఏపీ సెట్‌ పరీక్ష రాసిన తర్వాత విద్యార్థులు కంప్యూటర్‌ లాగ్‌ ఔట్‌ చేయగానే ఆ సెషన్‌లో తాము రాసిన పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయనేది అప్పుడే స్క్రీన్‌పై చెక్‌ చేసుకునే వెసులుబాటును తొలిసారిగా కల్పిస్తున్నారు. దీంతో ఏ ర్యాంకు వస్తుందనేది వెనువెంటనే అంచనాకు వచ్చే వీలుంది. పరీక్ష అనంతరం జరిగే కౌన్సెలింగ్‌లో తొలి ప్రాధాన్యం ర్యాంకును బట్టి కాలేజీలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. కాగా షెడ్యూల్‌ ప్రకారం ఈఏపీసెట్‌ 2026 అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌ పరీక్షలు మే 4, 5 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతాయి. మే 9 నుంచి జూన్ 11 వరకు ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు జరుగుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.