
సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు UPSC ఇంటర్వ్యూ అంటేనే ఒక ప్రత్యేకమైన అనుభవం. అభ్యర్థి చదువు, ఉద్యోగ అనుభవం, వ్యక్తిత్వం, హాబీలు, సామాజిక అవగాహన వంటి అనేక అంశాలను పరీక్షించేలా ప్రశ్నలు ఎదురవుతుంటాయి. తాజాగా శాశ్వత్ సంగ్వాన్ అనే అభ్యర్థికి సంబంధించిన ఓ మాక్ ఇంటర్వ్యూ సంభాషణ ఆసక్తికరంగా మారింది. ఇంటర్వ్యూ ప్రారంభం నుంచే అభ్యర్థి ప్రొఫైల్‌పై బోర్డు దృష్టి సారించింది. ఇంటర్వ్యూ గదిలోకి ప్రవేశించే ముందు శాశ్వత్ సంగ్వాన్ ‘May I come in?’ అంటూ అనుమతి కోరారు. అనంతరం బోర్డు సభ్యులు ఆయనను లోపలికి ఆహ్వానించారు. ‘Have you seen Shashwat?’ అంటూ సరదాగా ప్రారంభమైన సంభాషణ తర్వాత అభ్యర్థిని కూర్చోమని సూచించారు. ‘Introduce yourself’ అని బోర్డు సభ్యులు అడగడంతో శాశ్వత్ చెప్పింది వినీ అంతా సైలెంట్ అయ్యారు.
శాశ్వత్ సంగ్వాన్ తన స్వస్థలం భివానీ జిల్లాలోని హర్యానా అని తెలిపారు. బిట్స్ పిలానీలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించినట్లు చెప్పారు. తనకు విస్తృతమైన సాంస్కృతిక, వృత్తిపరమైన అనుభవం ఉందని వివరించారు. తొలుత ఓ మల్టీనేషనల్ కంపెనీలో Data Scientistగా పనిచేశానని, ఆ తర్వాత వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని India Trade Promotion Organisation (ITPO)లో పనిచేశానని చెప్పారు. వివిధ రంగాల్లో పనిచేసిన అనుభవం తనకు భిన్నమైన పరిస్థితులను అర్థం చేసుకునే అవకాశం కల్పించిందని ఆయన పరిచయం ద్వారా స్పష్టమవుతోంది.
ప్రస్తుతం తాను Indian Defence Estates Service (IDES)కు శిక్షణ పొందుతున్నట్లు శాశ్వత్ తెలిపారు. UPSC 2020 ఆధారంగా ఈ సర్వీసును కేటాయించినట్లు వివరించారు. ఇలా ప్రైవేట్ రంగంలోని డేటా సైన్స్ ఉద్యోగం నుంచి ప్రభుత్వ రంగ సంస్థలో అనుభవం సంపాదించి, చివరకు సివిల్ సర్వీసెస్‌లోకి అడుగుపెట్టిన తన ప్రయాణాన్ని బోర్డు ముందు వివరించారు. ఇంటర్వ్యూలో శాశ్వత్ తన హాబీలు, క్రీడా నేపథ్యాన్ని కూడా ప్రస్తావించారు. తాను మారథాన్ రన్నర్‌నని, అంతేకాకుండా National Basketball Playerనని చెప్పారు. అభ్యర్థి తనను తాను పరిచయం చేసుకున్న వెంటనే బోర్డు సభ్యుడు ఆయన చెప్పిన క్రీడా నేపథ్యంపై ప్రత్యేకంగా స్పందించారు. ‘You run marathon and you are a national basketball player?’ అంటూ ఆసక్తి వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రశ్నలు అభ్యర్థి వ్యక్తిత్వం, క్రీడలపై ఆసక్తి, సమయ నిర్వహణ, క్రమశిక్షణ వంటి అంశాలపై తదుపరి చర్చకు దారితీసే అవకాశం ఉంటుంది.
UPSC Personality Testలో కేవలం పుస్తక జ్ఞానాన్ని మాత్రమే కాకుండా అభ్యర్థి వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేస్తారు. విద్యా నేపథ్యం, ఉద్యోగ అనుభవం, హాబీలు, క్రీడలు, స్వస్థలం వంటి అంశాల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే అభ్యర్థులు తమ Detailed Application Form (DAF)లో పేర్కొన్న ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా హాబీలుగా పేర్కొన్న అంశాలను కేవలం పేరుకే కాకుండా వాటికి సంబంధించిన ప్రాథమిక, సమకాలీన విషయాలను కూడా తెలుసుకోవాలి. శాశ్వత్ సంగ్వాన్ తన బయోడేటాలో ఇంజినీరింగ్, డేటా సైన్స్, ప్రభుత్వ రంగ సంస్థలో అనుభవం, Indian Defence Estates Service, మారథాన్, జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ వంటి విభిన్న అంశాలు ఉండటంతో.. వీటిపైనే బోర్డు నుంచి మరిన్ని ప్రశ్నలు సంధించారు. UPSC ఇంటర్వ్యూలో మీ ప్రొఫైల్‌లోని ప్రతి అంశం ఒక ప్రశ్నకు దారి తీస్తుందనే విషయాన్ని ఈ మాక్ ఇంటర్వ్యూ గుర్తుచేస్తోంది.