
SBI SCO Recruitment 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఉద్యోగం పొందాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఎస్‌బీఐ Specialist Cadre Officer (SCO) Recruitment 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. Advertisement No. CRPD/SCO/2026-27/23 ద్వారా వెలువడిన ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 207 కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలు SBI Wealth Management విభాగంలో చేపట్టనున్నారు.
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా Zonal Head (Retail), Regional Head, Relationship Manager–Team Lead, Investment Specialist, Investment Officer, VP Wealth, AVP Wealth తదితర పోస్టులను భర్తీ చేస్తారు. దేశవ్యాప్తంగా 17 SBI సర్కిళ్లలో ఈ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అర్హత, వయసు, పని అనుభవం ఉన్న భారతీయ పౌరులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 2026 సెప్టెంబర్ 4న ప్రారంభమై.. సెప్టెంబర్ 25, 2026తో ముగుస్తుంది.
స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్: 207
ఈ పోస్టులు SBI Wealth Management vertical పరిధిలో ఉన్నాయి. పోస్టును బట్టి ఖాళీలు, అర్హతలు, పని అనుభవం వేర్వేరుగా ఉంటాయి.
అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగి ఉండాలి. పోస్టును బట్టి అదనపు విద్యార్హతలు, సంబంధిత పని అనుభవం అవసరం కావచ్చు.
కొన్ని పోస్టులకు MBA లేదా సంబంధిత పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో పాటు NISM, CFP, CFA వంటి ప్రొఫెషనల్ సర్టిఫికేషన్లు ఉంటే ప్రాధాన్యత ఇవ్వవచ్చు.
పోస్టును బట్టి అభ్యర్థుల వయోపరిమితి మారుతుంది.
వయసును నోటిఫికేషన్‌లో పేర్కొన్న కటాఫ్ తేదీ ఆధారంగా లెక్కిస్తారు. రిజర్వేషన్ కేటగిరీలకు వర్తించే వయో సడలింపులు నిబంధనల ప్రకారం ఉంటాయి.
ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ప్రధానంగా Shortlisting, Interview, CTC Negotiation ఉంటాయి. మొదట అభ్యర్థుల అర్హతలు, పని అనుభవం తదితర అంశాల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు సంబంధిత పోస్టుకు అనుగుణంగా CTCపై చర్చ జరుగుతుంది.
ఎంపికైన అభ్యర్థులను 5 సంవత్సరాల కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమిస్తారు. పోస్టును బట్టి వేతనం, ఇతర ప్రయోజనాలు ఉంటాయి. SBI కాంట్రాక్ట్ ఎంప్లాయ్‌మెంట్ పాలసీ ప్రకారం వీటిని అందిస్తారు.
అర్హత ఉన్న అభ్యర్థులు SBI అధికారిక Careers పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎస్బీఐ పోస్టుల దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ముఖ్య గమనిక: అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు పోస్టు వారీగా ఉన్న విద్యార్హత, వయసు, పని అనుభవం, ఖాళీలు, వేతనం తదితర వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో తప్పనిసరిగా పరిశీలించాలి.