Data Entry Jobs: ఏపీలోని ఆ జిల్లా కలెక్టర్‌ ఆఫీస్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.

|

Jan 13, 2023 | 12:19 PM

ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టర్‌ క్యారాలయంలో డేటా ఎంట్రీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం జిల్లా రెవెన్యూ శాఖ, ఎన్నికల విభాగంలో అవుట్ సోర్సింగ్‌ విధానంలో తీసుకోనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

Data Entry Jobs: ఏపీలోని ఆ జిల్లా కలెక్టర్‌ ఆఫీస్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.
Data Entry Jobs
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టర్‌ క్యారాలయంలో డేటా ఎంట్రీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం జిల్లా రెవెన్యూ శాఖ, ఎన్నికల విభాగంలో అవుట్ సోర్సింగ్‌ విధానంలో ఉద్యోగాలను తీసుకోనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 07 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీతో పాటుకంప్యూటర్‌ ఎంఎస్‌ ఆఫీస్‌లో డిప్లొమా/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు అందించాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా ఉంచిన బాక్సులో వేయాలి.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 18,500 జీతంగా చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 19-01-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..