NIN Hyderabad Jobs 2022: హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ న్యూట్రిషన్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా ఇంటర్వ్యూ..

|

Jul 26, 2022 | 4:55 PM

భారత ప్రభుత్వ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (NIN Hyderabad).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ సూపర్‌వైజర్‌, ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ వర్కర్ పోస్టుల (Project Supervisor Posts) భ‌ర్తీకి..

NIN Hyderabad Jobs 2022: హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ న్యూట్రిషన్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా ఇంటర్వ్యూ..
Nin Hyderabad
Follow us on

NIN Hyderabad Project Supervisor Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌ – నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (NIN Hyderabad).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ సూపర్‌వైజర్‌, ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ వర్కర్ పోస్టుల (Project Supervisor Posts) భ‌ర్తీకి నోటిఫికేస‌న్ జారీ చేసింది. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, పీజీ డిగ్రీల్లో అర్హత సాధించిన వారెవైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర ముఖ్య సమాచారం ఈ కింద తెలసుకోవచ్చు.

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 5

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ సూపర్‌వైజర్‌, ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ వర్కర్ పోస్టులు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.20,000ల నుంచి రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, పీజీ డిగ్రీల్లో (నూట్రీషన్, ఫుడ్‌ సైన్స్‌, సోషియాలజీ, సోషల్‌ వర్క్‌, పబ్లిక్‌ హెల్త్‌) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.

అడ్రస్: Conference hall and committee Room, ICMR-NIN, Hyderabad.

ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 4, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.