Central Govt Jobs 2026: గేట్‌ స్కోర్‌తో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షకుపైగా జీతం

కేంద్ర మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిఫిక్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఏ (గ్రూప్-బి, నాన్‌-గేజిటెట్‌ ఎస్‌ & టీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

Central Govt Jobs 2026: గేట్‌ స్కోర్‌తో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షకుపైగా జీతం
National Informatics Centre Jobs

Updated on: Feb 11, 2026 | 6:41 AM

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిఫిక్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఏ (గ్రూప్-బి, నాన్‌-గేజిటెట్‌ ఎస్‌ & టీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 376 సైంటిఫిక్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఏ పోస్టులను భర్తీ చేయనుంది. ఎంఎస్సీ, ఎంఎస్‌, ఎంసీఏ, బీఈ, బీటెక్‌ అర్హత కలిగిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరు గేట్‌ లోనూ ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

కేటగిరీ వారీగా ఖాళీల వివరాలు..

  • అన్‌ రిజర్వ్‌డ్‌ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 154
  • ఎస్సీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 56
  • ఎస్టీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 28
  • ఓబీసీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 101
  • ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 37

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో ఎంఎస్సీ/ ఎంఎస్‌/ ఎంసీఏ/ బీఈ/ బీటెక్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే 2024 లేదా 2025 లేదా 2026 సంవత్సరాల్లో వ్యాలిడ్‌ గేట్‌ స్కోర్‌ కూడా ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్ 2026 ఫలితాలు విడుదలైన తేదీ నుంచి వచ్చే 10 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన షార్ట్‌ నోటిఫికేషన్‌ ఎన్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో తాత్కాలికంగా అందుబాటులో ఉంటుంది. ఇతర వివరాలు త్వరలోనే విడుదల చేసే వివరణాత్మక నోటిఫికేషన్‌ ప్రకటించిన తర్వాత చెక్‌ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతంగా చెల్లిస్తారు. కాగా గేట్‌ 2026 పరీక్ష ఫలితాలు మార్చి 11, 2026 వెల్లడికానున్నాయి.

నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us