
హైదరాబాద్, జులై 15: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మరో కీలక అప్‌డేట్ జారీ చేసింది. ఇప్పటికే ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేసిన ఎన్టీయే తాజగా అభ్యర్ధులు ఓఎంఆర్ జవాబు పత్రాలు, రికార్డు చేసిన ప్రతి స్పందన (రికార్డెడ్ రెస్పాన్స్)లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే స్కాన్ కాపీలను అభ్యర్థుల ఈమెయిల్‌కు డైరెక్ట్‌గా పంపినట్లు ఎన్టీఏ తన ప్రకటనలో వెల్లడించింది.
ఒకవేళ ఓఎంఆర్ షీట్‌లో గుర్తించిన సమాధానాలకు, అందులో రికార్డయిన వివరాలకు మధ్య ఏదైనా తేడా ఉంటే ఆన్‌లైన్‌లో నిర్దేశించిన గడువులోగా అభ్యంతరాలను తెలపవచ్చని ఎన్టీయే తన ప్రకటనలో సూచించింది. అంటే అభ్యర్ధులు నమోదు చేసిన సమాధానాలలో లేదా తాత్కాలిక జవాబు కీలో లోపం ఉందని భావించే అభ్యర్థుల కోసం NTA రీ-నీట్ OMR షీట్ 2026 ఛాలెంజ్ సదుపాయాన్ని కూడా ప్రారంభించింది. జులై 15, ఉదయం గంటలలోపు అభ్యంతరాలను తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు రూ.200 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ OMR షీట్లు, ఆన్సర్ కీ డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అన్ని చెల్లుబాటు అయ్యే అభ్యంతరాలను సమీక్షించిన తర్వాత, రీ-నీట్ యూజీ 2026 తుది జవాబు కీని ఎన్‌టీఏ సిద్ధం చేస్తుంది. అనంతరం ఫలితాలను వెల్లడించనుంది. అభ్యంతరాలు నమోదుచేసే సమయంలో భద్రత కోసం ఈసారి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2ఎఫ్‌ఏ) విధానం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందుకు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈమెయిల్‌కు ఓటీపీ నమోదు తప్పనిసరి అని తెలిపింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఎన్టీఏ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. లేదా 011- 40759000/ 011- 69227700 నంబర్లకు నేరుగా ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని సూచించింది. ఇక NEET UG 2026 Re-exam తుది ఆన్సర్ కీ, ఫలితాలు జులై 20లోపు విడుదలయ్యే అవకాశం ఉంది.
నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ OMR షీట్లు, ఆన్సర్ కీ డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.