NEET UG 2026 Dress Code: నీట్‌ యూజీ పరీక్షకు డ్రెస్‌ కోడ్‌ తప్పనిసరి.. చిన్న తప్పు చేసినా నో ఎంట్రీ!

NEET UG 2026 dress code Rules: నీట్-యూజీ 2026 పరీక్షకు సమయం ఆసన్నమవుతోంది. మే 3న దేశ వ్యాప్తంగా ఆఫ్‌లైన్‌ విధానంలో లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు. ఇప్పటికే సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను సైతం ఎన్టీయే విడుదల చేసింది. త్వరలోనే అడ్మిట్‌ కార్డులను అందుబాటులోకి తీసుకురానుంది.

NEET UG 2026 Dress Code: నీట్‌ యూజీ పరీక్షకు డ్రెస్‌ కోడ్‌ తప్పనిసరి.. చిన్న తప్పు చేసినా నో ఎంట్రీ!
NEET UG Dress Code Norms

Updated on: Apr 20, 2026 | 1:26 PM

హైదరాబాద్, ఏప్రిల్ 20: ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్-యూజీ 2026 పరీక్షకు సమయం ఆసన్నమవుతోంది. మే 3న దేశ వ్యాప్తంగా ఆఫ్‌లైన్‌ విధానంలో లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు. ఇప్పటికే సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను సైతం ఎన్టీయే విడుదల చేసింది. త్వరలోనే అడ్మిట్‌ కార్డులను అందుబాటులోకి తీసుకురానుంది. అయితే నీట్‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎన్టీయే ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. పరీక్ష రోజున అడ్మిట్‌ కార్డుతోపాటు ఏదైనా ఒరిజినల్‌ గుర్తింపు కార్డును అభ్యర్ధులు తప్పనిసరిగా తమతోపాటు తీసుకురావల్సి ఉంటుంంది. అలాగే డ్రెస్‌ కోడ్‌ పాటించడం వంటి నిబంధనలు పాటించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. అభ్యర్దులు చేసే చిన్న చిన్న పొరపాట్లు వల్ల పెద్ద నష్టం తెచ్చుకోవద్దని సూచిస్తూ ఎక్స్‌ వేదికగా కీలక సూచనలు చేసింది. అవేంటంటే..

నీట్‌ యూజీ 2026 పరీక్ష రోజున అభ్యర్ధులు పాటించవల్సిన మార్గదర్శకాలు ఇవే

  • విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందుగానే చేరుకోవాలి. ప్రతి ఒక్కరూ ఎగ్జామినేషన్ గైడ్ లైన్స్ తప్పకుండా పాటించాలి.
  • నీట్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు చెల్లుబాటయ్యే ఒరిజినల్‌ ఐడీ తప్పనిసరిగా తమతోపాటు తీసుకెళ్లాలి. సరైన ఐడీ ప్రూఫ్‌ లేకపోతే ఎగ్జామ్‌ సెంటర్‌లోకి అనుమతించరు.
  • పెన్నుతో మాత్రమే ఓఎంఆర్‌ షీట్‌ను జాగ్రత్తగా నింపాలి. కొట్టివేతలు, కరెక్షన్‌ ఫ్లూయిడ్‌ వినియోగించకూడదు.
  • విద్యార్థులు డ్రెస్‌ కోడ్ విధిగా పాటించాలి. పొడవు చేతులున్న డ్రెస్‌లు, మందంగా ఉండే దుస్తులు ధరించకూడదు. ఎలాంటి మెటల్‌ నగలు, వస్తువులకు పరీక్ష కేంద్రాలోకి అనుమతి లేదు.
  • వాచ్‌, సెల్‌ఫోన్‌ వంటి ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
  • ఏదైనా సంప్రదాయ వస్తువులు ఏవైనా ధరించాల్సి వస్తే ముందుగానే ఎగ్జామ్స్ సెంటర్లో ఒక గంట ముందు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
    జామెట్రీ, పెన్సిల్ బాక్స్, ప్లాస్టిక్ పౌచ్, కాలిక్యులేటర్, పెన్, స్కేల్, రైటింగ్ ప్యాడ్, పెన్ డ్రైవ్, ఎరేజర్, కాలిక్యులేటర్ లాగ్ టేబుల్,
  • ఎలక్ట్రానిక్ స్కానర్ వంటివి వస్తువులను తీసుకెళ్లకూడదు.
  • మొబైల్ ఫోన్‌, బ్లూటూత్, ఇయర్ ఫోన్స్, మైక్రోఫోన్, హెల్త్ బ్యాండ్‌ కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదు.
  • వాలెట్, బెల్ట్, క్యాప్ వంటివి ధరించకూడదు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us