NEET PG 2026 ఫలితాల్లో తెలంగాణ అమ్మాయి సత్తా.. జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు!

నీట్ పీజీ 2026 ఫలితాల్లో తెలంగాణకు చెందిన పల్లాక్షి ప్రసాద్ 633 మార్కులతో జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. తహ అమ్రీన్ 607 మార్కులతో 43వ ర్యాంకు దక్కించుకున్నారు. రాష్ట్ర చిరునామాతో పరీక్షలో అర్హత సాధించిన 7,676 మంది అభ్యర్థుల జాబితాను కాళోజీ వర్సిటీ విడుదల చేసింది. త్వరలోనే పీజీ మెడికల్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా, రాష్ట్రంలో 200కు పైగా పీజీ సీట్లు పెరిగే అవకాశం ఉంది..

NEET PG 2026 ఫలితాల్లో తెలంగాణ అమ్మాయి సత్తా.. జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు!
NEET PG Telangana Toppers

Updated on: Oct 12, 2026 | 10:37 AM

హైదరాబాద్, అక్టోబర్ 12: నీట్ పీజీ 2026 ఫలితాల్లో తెలంగాణకు చెందిన విద్యార్థులు ప్రతిభ చాటారు. రాష్ట్రానికి చెందిన పల్లాక్షి ప్రసాద్ 633 మార్కులతో జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. తహ అమ్రీన్ 607 మార్కులతో 43వ ర్యాంకు దక్కించుకున్నారు. జాతీయ స్థాయిలో టాప్‌ 100లోపు ర్యాంకులు సాధించిన తెలంగాణ అభ్యర్థులు ఇద్దరూ అమ్మాయిలే కావడం విశేషం. నీట్ పీజీ 2026లో తెలంగాణ చిరునామాతో దరఖాస్తు చేసుకున్న పలువురు అభ్యర్థులు మంచి ర్యాంకులు సాధించారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి.

టాప్ ర్యాంకులు సాధించిన అభ్యర్థులు వీరే!

  • పల్లాక్షి ప్రసాద్: 633 మార్కులు, జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు
  • తహ అమ్రీన్: 607 మార్కులు, జాతీయ స్థాయిలో 43వ ర్యాంకు
  • జోస్యుల చైతన్య కార్తీక్: 598 మార్కులు, జాతీయ స్థాయిలో 127వ ర్యాంకు
  • చొల్లేటి తేజ: 598 మార్కులు, జాతీయ స్థాయిలో 129వ ర్యాంకు
  • పట్కూరి మహిత శ్రీకీర్తి: 597 మార్కులు, జాతీయ స్థాయిలో 137వ ర్యాంకు

ఈ నెల 12న నీట్ పీజీ కౌన్సెలింగ్ నోటిఫికేషన్?

నీట్ పీజీ 2026 ఫలితాలను సెప్టెంబర్ 24న విడుదల చేశారు. తాజాగా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం రాష్ట్ర చిరునామాతో పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 7,676 మంది ఉన్నారు. అయితే ఈ జాబితాను రాష్ట్రస్థాయి స్థానిక ర్యాంకులుగా పరిగణించలేమని కాళోజీ వర్సిటీ వర్గాలు స్పష్టం చేశాయి. వీరంతా తెలంగాణ చిరునామాతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులేనని తెలిపాయి. కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అభ్యర్థుల స్థానికతకు సంబంధించిన వివరాలు స్పష్టమవుతాయని వెల్లడించాయి. మరోవైపు నీట్ పీజీ ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించేందుకు కాళోజీ వర్సిటీ సిద్ధమైంది. ఈ నెల 12న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. నోటిఫికేషన్ అనంతరం అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఈసారి 200కు పైగా పీజీ మెడికల్ సీట్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే పీజీ వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us