NEERI Recruitment: నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. ఇన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

|

Oct 21, 2021 | 11:16 AM

NEERI Recruitment: నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లోని తార్నకలో ఉన్న ఈ సంస్థలో మొత్తం..

NEERI Recruitment: నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. ఇన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
Neeri Jobs
Follow us on

NEERI Recruitment: నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లోని తార్నకలో ఉన్న ఈ సంస్థలో మొత్తం 13 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్న ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 13 ఖాళీలకు గాను ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ (10), ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ (03) పోస్టులు ఉన్నాయి.

* ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

* అభ్యర్థుల వయసు 50ఏళ్‌లు మించకూడదు.

* ప్రాజెక్ట్ అసోసియేట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎమ్మెస్సీ (ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌), బీబీ/ బీటెక్‌ (ఎన్విరాన్‌మెంటల్‌/ సివిల్‌ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత సాధించాలి.

* అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు మొదట ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని, తర్వాత దరఖాస్తులను ఈమెయిల్‌ విధానంలో పంపించాలి.

* అభ్యర్థులు తమ వివరాలను hzcparecruit@gmail.comకి పంపించాలి.

* ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 20000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

* ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 25,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తులకు 14-11-2021 చివరి తేదీకాగా.. ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేయడానికి 19-11-2021 చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Shah Rukh Khan: జైలుకెళ్లి తనయుడు ఆర్యన్‌ను కలిసిన బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్

Virat Kohli: వామికను ఇప్పటి వరకు ప్రపంచానికి చూపించని విరుష్క జంట.. తాజాగా పోస్ట్‌ చేసిన ఫోటోలనూ..

Crying Room: ఏడవడానికి మొహమాటం అవసరం లేదు.. మనసారా ఏడ్చేందుకు ప్రత్యేక గదులు.. ఎక్కడో తెలుసా?