NABCONS Recruitment 2022: బీటెక్‌ అర్హతతో నాబార్డు పరిధిలోని నాబ్కాన్స్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారానే..

భారత ఆర్ధిక మంత్రిత్వశాఖకు చెందిన నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్- నాబ్కాన్స్ (NABCONS).. ఒప్పంద ప్రాతిపదికన 6 క్లస్టర్ కోఆర్డినేటర్ పోస్టు (Cluster Coordinator posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

NABCONS Recruitment 2022: బీటెక్‌ అర్హతతో నాబార్డు పరిధిలోని నాబ్కాన్స్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారానే..
Nabcons

Updated on: Sep 20, 2022 | 7:30 AM

NABCONS Cluster Coordinator Recruitment 2022: భారత ఆర్ధిక మంత్రిత్వశాఖకు చెందిన నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్- నాబ్కాన్స్ (NABCONS).. ఒప్పంద ప్రాతిపదికన 6 క్లస్టర్ కోఆర్డినేటర్ పోస్టు (Cluster Coordinator posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి అగ్రికల్చర్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ/అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తు దారుల వయసు 45 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్‌ 28, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ/అనుభవం ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.24,000లతోపాటు రూ.5,000ల ట్రావెల్‌ అవెన్స్‌ కూడా జీతంగా చెల్లిస్తారు. ఈ పోస్టులకు ఎంపికైనవారు పశ్చిమ బెంగాల్‌లో పనిచేయవల్సి ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us