Madras IIT: మద్రాసులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఉచిత ఆన్‌లైన్ కోర్సును ప్రారంభించబోతోంది. నేషనల్ ప్రోగ్రాం ఆన్ టెక్నాలజీ సహాయంతో ఈ కోర్సు అందిస్తున్నారు. ఈ కోర్సు చేయాలనుకునే అభ్యర్థులు ఐఐటి మద్రాస్ (iitm.ac.in) అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా ఎన్‌పిటిఎల్ (NPTEL) అధికారిక వెబ్‌సైట్ nptel.ac.in ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.
12 వారాల కోర్సు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన ఈ కోర్సు 12 వారాలు ఉంటుంది. దీనిలో సమస్య పరిష్కారం కోసం శోధన పద్ధతి బోధిస్తారు. ఐఐటి మద్రాసు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ దీపక్ ఖేమనీ ఈ కోర్సును విద్యార్థుల కోసం నిర్వహిస్తారు. ఈ కోర్సు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అలాగే డేటా సైన్స్ యుజి, పిజి విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
జూలై 26 నుండి కోర్సు ప్రారంభం..
ఈ కోర్సు జూలై 26 నుండి అక్టోబర్ 15 వరకు ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 2 లోగా ఎన్‌పిటిఎల్ వెబ్‌సైట్ ద్వారా ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ అనుకూలాంశం ఏమిటంటే, ఈ కోర్సు కోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అక్టోబర్ 23 న పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షకు హాజరు కావడానికి మాత్రం అభ్యర్థులు 1000 రూపాయల రుసుము చెల్లించాలి. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈ కోర్సు సర్టిఫికేట్ కూడా లభిస్తుంది.
ఎలా దరఖాస్తు చేయాలి