IRCON Recruitment: ఇర్కాన్‌ ఇంటర్నేషన్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం పొందే అవకాశం..

న్యూఢిల్లీలోని ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థలో సైట్‌ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

IRCON Recruitment: ఇర్కాన్‌ ఇంటర్నేషన్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం పొందే అవకాశం..
Ircon Jobs

Updated on: Oct 18, 2022 | 7:05 AM

న్యూఢిల్లీలోని ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థలో సైట్‌ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 16 సైట్‌ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ/ బీటెక్‌/ డిప్లొమా (సివిల్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో కనీసం 10 ఏళ్లు అనుభవం ఉండాలి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు తమ వివరాలను ఇర్కాన్‌ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌, డిస్ట్రిక్ట్‌ సెంటర్‌, న్యూఢిల్లీ, 110017 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1,10,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 05-11-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us