India Post GDS Recruitment: టెన్త్ పాసైతే చాలు.. తపాలా శాఖలో 23,757 ఉద్యోగాలు! ఇలా అప్లై చేయండి

India Post GDS Recruitment 2026: పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో 23,757 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో 917, తెలంగాణలో 419 పోస్టులు ఉన్నాయి. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు విధానం వివరాలు తెలుసుకోండి.

India Post GDS Recruitment: టెన్త్ పాసైతే చాలు.. తపాలా శాఖలో 23,757 ఉద్యోగాలు! ఇలా అప్లై చేయండి
India Post Gds Recruitment 2026

Updated on: Sep 09, 2026 | 4:00 PM

India Post GDS Recruitment 2026 Telugu: పదో తరగతి పాసైన నిరుద్యోగులకు తపాలా శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో మొత్తం 23,757 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాల్లో ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM), డాక్ సేవక్ హోదాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత ప్రధాన అర్హతగా ఉంది. పోస్టును బట్టి ప్రారంభంలో రూ.10,000 నుంచి రూ.12,000 వరకు వేతనం అందుకునే అవకాశం ఉంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 21, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు ఎన్ని?

ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా 23,757 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్‌లో మొత్తం 917 పోస్టులు ఉన్నాయి.

  • UR – 400
  • OBC – 213
  • SC – 125
  • ST – 45
  • EWS – 109
  • PwBD – 25

తెలంగాణలో ఖాళీలు

తెలంగాణ పోస్టల్ సర్కిల్‌లో మొత్తం 419 పోస్టులు ఉన్నాయి.

  • UR – 201
  • OBC – 85
  • SC – 59
  • ST – 17
  • EWS – 45
  • PwBD – 12

ఏ పోస్టుల్లో నియామకం?

ఈ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన అభ్యర్థులను ప్రధానంగా కింది హోదాల్లో నియమిస్తారు.

  1. బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM)
  2. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM)
  3. డాక్ సేవక్

విద్యార్హత

అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతిలో స్థానిక భాషను ఒక సబ్జెక్టుగా చదివి ఉండటం వంటి నిబంధనలు నోటిఫికేషన్ ప్రకారం వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు

అర్హత ఉన్న అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. అయితే మహిళలు, SC, ST, PwBD వంటి నిర్దిష్ట కేటగిరీల అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

అభ్యర్థులు ముందుగా ఇండియా పోస్ట్ GDS అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.

Step 1: రిజిస్ట్రేషన్

  • అధికారిక GDS వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
  • సంబంధిత నోటిఫికేషన్‌ను ఓపెన్ చేసి Click Here to Registerపై క్లిక్ చేయాలి.
  • New Candidate Registration ఎంపిక చేసుకోవాలి.
  • మొబైల్ నంబర్ నమోదు చేసి Send OTPపై క్లిక్ చేయాలి.
  • మొబైల్‌కు వచ్చిన OTPని నమోదు చేసి Verify OTP చేయాలి.
  • అనంతరం ఈ-మెయిల్ ఐడీ నమోదు చేసి, వచ్చిన OTPని వెరిఫై చేయాలి.
  • పేరు, పుట్టిన తేదీ, లింగం, తల్లిదండ్రుల పేర్లు, కమ్యూనిటీ తదితర వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి.
  • Complete Registrationపై క్లిక్ చేయాలి.
  • రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మొబైల్ నంబర్‌కు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ వస్తాయి.

Step 2: లాగిన్

రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత వెబ్‌సైట్‌లోని Login ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేసి Verify OTPపై క్లిక్ చేయాలి.

Step 3: ఫీజు చెల్లింపు

లాగిన్ అయిన తర్వాత Fee Payment ఆప్షన్‌ను ఎంచుకోవాలి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా ఫీజు చెల్లించవచ్చు.

Step 4: అప్లికేషన్ ఫారమ్ పూర్తి చేయాలి

ఫీజు చెల్లించిన తర్వాత Apply Onlineపై క్లిక్ చేయాలి. అప్లికేషన్ ఫారమ్‌లో అవసరమైన వివరాలను నమోదు చేయాలి.

  • వ్యక్తిగత వివరాలు
  • చిరునామా
  • విద్యార్హతలు
  • పదో తరగతి చదివిన రాష్ట్రం
  • పాసైన సంవత్సరం
  • బోర్డు వివరాలు
  • హాల్ టికెట్ నంబర్
  • సబ్జెక్టుల వారీగా మార్కులు/పాయింట్లు

వివరాలను నమోదు చేసిన తర్వాత Save and Nextపై క్లిక్ చేయాలి.

Step 5: పోస్టుల ఎంపిక

అభ్యర్థులు తమకు కావాల్సిన పోస్టాఫీసులను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసుకోవాలి. సర్కిల్, డివిజన్ ఆధారంగా BPM/ABPM/డాక్ సేవక్ పోస్టులకు గరిష్ఠంగా 20 పోస్టాఫీసులను ఎంచుకోవచ్చు.

Step 6: ఫొటో, సంతకం అప్‌లోడ్

అనంతరం నిర్దేశించిన ఫార్మాట్, సైజులో ఫొటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. డిక్లరేషన్‌ను చదివి టిక్ చేయాలి. అనంతరం Previewపై క్లిక్ చేయాలి.

Step 7: అప్లికేషన్ సబ్మిట్

స్క్రీన్‌పై కనిపించే అన్ని వివరాలను మరోసారి జాగ్రత్తగా పరిశీలించాలి. తప్పులు ఏమైనా ఉంటే సరిచేసుకుని చివరగా Submit Applicationపై క్లిక్ చేయాలి. దీంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.

అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడం ఎలా?

దరఖాస్తు పూర్తయిన తర్వాత భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ కాపీని భద్రపరుచుకోవడం మంచిది.

దీని కోసం డ్యాష్‌బోర్డ్‌లోని My Application ఆప్షన్‌పై క్లిక్ చేసి అప్లికేషన్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం Download PDFపై క్లిక్ చేసి అప్లికేషన్ కాపీని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తుల ప్రారంభం: ఆగస్టు 31, 2026
  • దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 21, 2026
  • మొత్తం ఖాళీలు: 23,757
  • ఆంధ్రప్రదేశ్: 917
  • తెలంగాణ: 419
  • అర్హత: పదో తరగతి పాస్
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ పోస్టల్ శాఖలో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు ఈ రిక్రూట్‌మెంట్ మంచి అవకాశంగా చెప్పొచ్చు. అయితే దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌లో వయోపరిమితి, స్థానిక భాష, డాక్యుమెంట్లు, ఇతర అర్హతలు వంటి పూర్తి నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us