GGH Siddipet District Recruitment 2022: తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సిద్ధిపేటలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH).. ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్టు డాక్టర్ పోస్టుల (Specialist Doctor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
ఖాళీల సంఖ్య: 3
పోస్టుల వివరాలు: స్పెషలిస్టు డాక్టర్ పోస్టులు
విభాగాలు: రేడియాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.
పే ప్కేల్: నెలకు రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్ పీజీ (ఎండీ)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.
అడ్రస్: కాన్ఫరెన్స్ హాల్, జీజీహెచ్, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ.
ఇంటర్వ్యూ తేదీ: మే 9, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: