ECIL Hyderabad Recruitment 2022: బీటెక్‌ అర్హతతో.. హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు..

|

Nov 08, 2022 | 2:54 PM

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

ECIL Hyderabad Recruitment 2022: బీటెక్‌ అర్హతతో.. హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు..
ECIL Hyderabad Recruitment 2022
Follow us on

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన 70 టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలి-కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌ స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు అక్టోబర్‌ 31, 2022వ తేదీ నాటికి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో మినహాయింపు ఉంటుంది.

ఈ అర్హతలు కలిగిన వారు నవంబర్‌ 13, 14 తేదీల్లో కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఎంపికై వారు హైదరాబాద్‌లో పనిచేయవల్సి ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.25,000ల చొప్పున జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్: Factory Main Gate, Electronics Corporation of India Limited, ECIL Post, Hyderabad – 500062.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.