తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందని హైదరాబాద్ జిల్లాలోని హెల్త్ సొసైటీ కింద బస్తీ దవాఖానాల్లో.. ఒప్పంద ప్రాతిపదికన 31 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ కలెక్టర్ అండ్ జిల్లా మేజిస్ట్రేట్, ఛైర్మన్ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 18 నుంచి 44 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో నవంబర్ 11, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించవచ్చు. అకడమిక్ మెరిట్, రిజర్వేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్:
DM&HO, Hyderabad, 4th floor, GHMC Building, Patny, Secunderabad.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.https://hyderabad.telangana.gov.in/
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.