CRPF Recruitment 2022: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు బంపరాఫర్‌..! సీఆర్‌పీఎఫ్‌లో డిప్యూటీ కమాండెంట్‌ఉద్యోగాలు..

|

May 06, 2022 | 4:21 PM

భారత్ ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌ రిజర్వ్ పోలీస్‌ ఫోర్స్‌ (CRPF).. ఒప్పంద ప్రాతిపదికన డిప్యూటీ కమాండెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల (Deputy Commandant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

CRPF Recruitment 2022: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు బంపరాఫర్‌..! సీఆర్‌పీఎఫ్‌లో డిప్యూటీ కమాండెంట్‌ఉద్యోగాలు..
Crpf
Follow us on

CRPF Deputy Commandant Recruitment 2022: భారత్ ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌ రిజర్వ్ పోలీస్‌ ఫోర్స్‌ (CRPF).. ఒప్పంద ప్రాతిపదికన డిప్యూటీ కమాండెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల (Deputy Commandant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: డిప్యూటీ కమాండెంట్‌ ఇంజనీర్‌ పోస్టులు

మొత్తం ఖాళీలు: 11

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.75,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సివిల్ ఇంజనీరింగ్‌లో ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో ఐదేళ్ల అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.

అడ్రస్‌: సంబంధింత రాష్ట్రాల్లోని సీఆర్పీఎఫ్‌-డీఐజీపీ ఆఫీసుల్లో నిర్వహిస్తారు.

పని ప్రదేశాలు: న్యూఢిల్లీ, గువహటి (అస్సాం), హైదరాబాద్‌ (తెలంగాణ)

ఇంటర్వ్యూ తేదీలు: 2022, మే 19 నుంచి జూన్‌ 2 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి

Also Read:

IHBT Recruitment 2022: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ బయోరిసోర్స్ టెక్నీలజీలో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు.. నెలకు 67 వేల జీతం..