Govt Doctor Jobs: సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..

Govt Doctor Jobs: తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (GGH)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. కాంట్రాక్ట్‌ విధానంలో పలు విభాగాల్లో ఉన్న స్పెషలిస్ట్‌ డాక్టర్‌...

Govt Doctor Jobs: సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..
Govt Jobs

Updated on: May 03, 2022 | 2:01 PM

Govt Doctor Jobs: తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (GGH)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. కాంట్రాక్ట్‌ విధానంలో పలు విభాగాల్లో ఉన్న స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 03 డాక్టర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో రేడియాలంజీ, మైక్రో బయాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ (ఎండీ)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది.

* ఇంటర్వ్యూలను సిద్ధిపేట జనరల్ హాస్పిటల్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించనున్నారు.

* అభ్యర్థులను అకడమిక్‌ ఫలితాలు, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* మే 09వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 100000 చెల్లిస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Also Read: Akshaya Trutiya 2022: తెలుగు రాష్ట్రాల్లో అక్షయ తృతీయ శోభ.. కిటకిటలాడుతున్న గోల్డ్ షాప్స్.. కొనే ముందు ఈ విషయాలు తీసుకోండి..

Flipkart Big Saving Days Sale: ఈ రోజు నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. వాషింగ్‌ మిషన్‌ నుంచి ఏసీ వరకు అన్ని చౌక..!

మరీ ఇలా ఉన్నారేంట్రా బాబూ !! ఈ కారు నెంబర్‌ ప్లేట్‌ ధర రూ. 70 కోట్లు పై మాటే !!