Coal India Limited Jobs 2022: రాత పరీక్షలేకుండా నెలకు రూ. 2 లక్షల జీతంతో కోల్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు..

|

Sep 20, 2022 | 7:13 AM

భారత ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (Coal India Limited).. 41 సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్/మెడికల్ స్పెషలిస్ట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ (జీడీఎంవో) పోస్టు (Senior Medical Specialist posts)ల భర్తీకి..

Coal India Limited Jobs 2022: రాత పరీక్షలేకుండా నెలకు రూ. 2 లక్షల జీతంతో కోల్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు..
Coal India Limited
Follow us on

Coal India Limited Senior Medical Specialist Recruitment 2022: భారత ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (Coal India Limited).. 41 సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్/మెడికల్ స్పెషలిస్ట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ (జీడీఎంవో) పోస్టు (Senior Medical Specialist posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సర్జన్, జనరల్ ఫిజిషియన్, జి అండ్‌ ఓ, అనస్తీషియా, ఆర్థోపెడిక్, పాథాలజిస్ట్, ఆప్తాల్మాలజిస్ట్, ఈఎన్‌టీ, రేడియాలజిస్ట్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ, డీఎన్‌బీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి 35, 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా అక్టోబర్‌ 20, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్షలేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.60,000ల నుంచి రూ.2,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అడ్రస్: Office of General Manager (personal/Recruitment), Recruitment department, NCL HQ, Singrauli (M.P)-486889.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.